Masooda Film Review: కొత్తగా అనిపించిన 'మసూద'

Twitter IconWatsapp IconFacebook Icon
Masooda Film Review: కొత్తగా అనిపించిన మసూద

సినిమా: మసూద (Masooda Review)

నటీనటులు : సంగీత(Sangeetha), తిరువీర్(Thiruveer), కావ్య కళ్యాణ్ రామ్(Kavya kalyan ram), శుభలేఖ సుధాకర్, సత్యం రాజేష్, అఖిలా రామ్, సత్య ప్రకాష్ తదితరులు

సినిమాటోగ్రాఫి: నగేష్ బనెల్

సంగీతం : ప్రశాంత్ ఆర్. విహారి(Prasanth R vihari)

రచన, దర్శకత్వం : సాయికిరణ్ (Sai kiran)

నిర్మాత : రాహుల్ యాదవ్ నక్కా(Rahul yadav nakka)


- సురేష్ కవిరాయని 

ఇంకో శుక్రవారం వచ్చింది, మళ్ళీ ఓ నాలుగు చిన్న సినిమాలు విడుదల అయ్యాయి. అందులో ఈ 'మసూద' ట్రైలర్ కొంచెం ఆసక్తికరంగా వుంది. ఈ చిత్ర నిర్మాత రాహుల్ యాదవ్ ఇంతకు ముందు 'మళ్ళీ రావా', 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'  లాంటి సినిమాలు తీశాడు. ఈ 'మసూద' సినిమా ద్వారా ఇంకో కొత్త దర్శకుడు సాయి కిరణ్ ని పరిచయం చేశాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని విడుదల చేయడం కూడా ఈ సినిమా మీద మరి కొంచెం ఆసక్తి పెరగడానికి కారణం. ఈ సినిమా హారర్ జానర్ అని అన్నారు, మరి బయపెట్టిందో లేదో ఎలా వుందో చూద్దాం. (Masooda Review)Masooda Story కథ: 

నీలం (Neelam)(సంగీత) ఒక పాటశాలలో ఫిజిక్స్ టీచర్ గా పనిచేస్తూ, ఆమె కుమార్తె నాజియా (బాంధవి శ్రీధర్) తో పాటు ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు వుంటుంది. అదే అపార్ట్ మెంట్ లో పై అంతస్థులో గోపికృష్ణ (తిరువీర్) అనే సాఫ్ట్ వేర్ వుద్యోగి ఉంటాడు. గోపి తన ఆఫీసులో పనిచేసే మినీ (కావ్యా కళ్యాణ్ రామ్) అనే అమ్మాయి అంటే ఇష్టపడతాడు. కానీ ఆమెకు ప్రపోజ్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతూ వుంటాడు. అయితే ఆమె ఒకరోజు తనంతట తానే గోపి ఇంటికి వస్తాను అని చెప్పి వస్తుంది. ఇద్దరూ దగ్గర అయ్యే సమయానికి తలుపు చప్పుడు వినిపిస్తుంది, తీర తీసి చూస్తే ఎదురుగా నీలం టీచర్ వుంటుంది. చిన్న ప్రాబ్లం వుంది అని చెప్పి వాళ్ళ ఇంటికి రమ్మని అడుగుతుంది. ఆ సమయం లో నీలం టీచర్ ని చూసిన గోపి ప్రేమించిన అమ్మాయిని వదిలి మరీ వెళతాడు. తీర నీలం ఇంటికి వెళ్ళి చూస్తే ఆమె కూతురు నజియా ఏదోలా మాట్లాడుతూ కనపడుతుంది. దెయ్యం పట్టిందేమో అని గోపి అనుకోని అదే విషయాని నీలం కి కూడా చెప్తాడు. ఆ దెయ్యాన్ని వదిలించడం కోసం గోపి, నీలం ఏమి చేశారు? ఈ మసూద ఎవరు ఎందుకు ఆమె ఆత్మగా మారింది ఇవన్నీ మీరు వెండి తెర మీద చూడాల్సిందే!(Masooda Review)Masooda Film Review: కొత్తగా అనిపించిన మసూద

విశ్లేషణ:(Masooda Review)


ఈ 'మసూద' సినిమా తో సాయి కిరణ్ అనే అబ్బాయి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఇతను హారర్ జానర్ ఎంచుకున్నాడు. అయితే మామూలుగా తెలుగు తెర మీద హారర్ అనగానే మనకి దెయ్యం పట్టినప్పుడు మంత్రగాడు, పూజలు, హిందూ సాంప్రదాయాల ప్రకారం ఎలా చేస్తారో చూస్తూ వుంటాము. కానీ దర్శకుడు కొత్తగా ఒక ముస్లిం అమ్మాయి కి దెయ్యం పడితే ఎలా వుంటుంది అనేది చూపించాడు. అందువల్ల కొంచెం ముస్లిం నేపధ్యం లో కథ సాగుతుంది. కానీ దర్శకుడు కొత్త ప్రదేశాలను, కొంచెం కొత్తగా చూపించటానికి ప్రయత్నం చేశాడు. కొంతవరకు మాత్రమే సఫలీకృతుడు అయ్యడాని చెప్పవచ్చు. ఎందుకంటే సినిమా ఏదో భయపెట్టేస్తాడు అని అనుకున్నాం కానీ, అలా ఏమి బయపెట్టలేదు. 

దర్శకుడు ఇందులో వుండే పాత్రలు వారి స్వభావాలు పరిచయం చేయడానికి కొంచెం టైమ్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. అలాగే మొదట పది నుముషాలు చాలా ఆసక్తికరంగా తీశాడు కూడా. కానీ ఆ తరువాత కొంచెం కథ మీద దర్శకుడు దృష్టి పెట్టి వుంటే బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటే మధ్యలో  కథ అసలు ఏమి నడవటం లేదు అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. ఒక్కటి మాత్రం బాగుంది, సన్నివేశాలని చూపించడం లో చాలా కొత్తగా చూపించాడు, అందులో కొన్ని చాలా ఆసక్తికరంగా వుంటాయి. క్లైమాక్స్ మీద కూడా కొంచెం దృష్టి పెట్టి వుంటే బాగుండేది. చాలా మాటటుకు దర్శకుడు బ్యాక్ గ్రౌండ్ సంగీతం మీదే ఎక్కువ ఆధారపడి కథని విస్మరించడా అని అనిపిస్తుంది. (Masooda Review)


ఈ హారర్ సినిమాలకి సంగీతం చాలా ముఖ్యం. అదే ఆయువు పట్టు కూడా. ఈ సినిమాకి అది ప్రశాంత్ విహారి చాలా బాగా అందించాడు. సన్నివేశాలు ఆసక్తికరంగా రావటానికి ప్రశాంత్ అంధించిన సంగీతమే ఈ సినిమా బాగా రావడానికి దోహద పడింది. కొన్ని సన్నివేశాల్లో ఏమవుతుంది అనే ఆసక్తి ప్రేక్షకుడికి కలగ చేయడం లో ప్రశాంత చాలా కీలక పాత్ర పోషించాడు అనే చెప్పాలి. సంగీతం ఈ సినిమాకి కొంచెం ప్రయాణం పోసింది. అలాగే సినిమాటోగ్రఫీ కూడా ఇంకో ప్రధాన పాత్ర పోషించింది. నగేష్ కొత్త కొత్త ప్రదేశాలను చాలా కొత్తగా, ఫ్రెష్ గా చూపించటం లో చాలా కృత్యకృత్యుడయ్యాడు.  సినిమాటోగ్రాఫి చాలా బాగుంది, ఈ సినిమా బాగా రావడానికి హారర్ సినిమాకు కావాల్సిన ఫీల్ రావడానికి వూపయోగపడింది. 

ఇక నటీనటుల విషయానికి వస్తే తిరువేర్ చాలా బాగా చేశాడు. అతను ఇంతకు ముందు కొన్ని వెబ్ సిరీస్ లో కూడా చేశాడు, అలాగే కొన్ని సినిమాలు కూడా చేశాడు. ఇందులో కొంచెం పక్కింటి అబ్బాయిల వుండే పాత్ర, చక్కగా ఇమిడిపోయాడు. సంగీత ఒక ప్రధాన పాత్ర, ముఖ్యమయిన పాత్ర పోషించింది. ఆమె ఇంతకు ముందు చేసిన పాత్రలతో పోలిస్తే, ఇది కొంచెం మంచి పాత్ర. పర్ఫార్మన్స్ చేసి చూపించాలి, అలాగే చేసింది. కావ్యా కళ్యాణ్ రామ్‌ మొదటి సారిగా కథానాయికగా చేసింది ఈ సినిమాలో. ఇంతకు ముందు బాలనటిగా పలు సినిమాల్లో నటించింది. ఆమె అందంగా వుంది, అలాగే అభినయం కూడా బాగుంది. ఆమె వాయిస్ చాలా బాగుంది. 'శుభలేఖ' సుధాకర్ కూడా పెద్ద పాత్ర లో కనపడతాడు, అలాగే 'సత్యం' రాజేష్ కూడా. సంగీత కుమార్తె పాత్ర నాజియా గా  బాంధవి శేఖర్ నటన నటించింది, ఆమె నటన ఆకట్టుకుంటుంది. (Masooda Review)


చివరగా, 'మసూద' సినిమా కొంచెం కొత్తగా అనిపిస్తుంది. మధ్య మధ్యలో చిన్నగా బయపెట్టిన, ప్రదేశాలు, సన్నివేశాలు కొంచెం కొత్తగా అనిపించటం వల్ల సినిమా ఆసక్తికరంగా వుంటుంది. ఒక్కసారి చూడవచ్చు.(Masooda Review)


AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.