ఆసక్తికరంగా ‘మూన్‌ నైట్’ న్యూ ట్రైలర్

ABN , First Publish Date - 2022-01-19T23:09:01+05:30 IST

మార్వెల్ స్టూడియోస్ వారి ‘మూన్‌నైట్’ సిరీస్ న్యూ ట్రైలర్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ బుధవారం విడుదల చేసింది. మార్చి 30న ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు మరియు మలయాళంలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో

ఆసక్తికరంగా ‘మూన్‌ నైట్’ న్యూ ట్రైలర్

మార్వెల్ స్టూడియోస్ వారి ‘మూన్‌నైట్’ సిరీస్ న్యూ ట్రైలర్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ తాజాగా విడుదల చేసింది. మార్చి 30న ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు మరియు మలయాళంలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ కానున్న ఈ ఒరిజినల్, లైవ్-యాక్షన్ సిరీస్‌కు సంబంధించిన న్యూ పోస్టర్‌ను కూడా తాజాగా విడుదల చేశారు. 


ఈ సిరీస్‌లో స్టీవెన్ గ్రాంట్ అనే మృదు స్వభావం కలిగిన గిఫ్ట్-షాప్ ఉద్యోగి, అతని జీవితంలో మరో జన్మకు సంబంధించిన జ్ఞాపకాలతో బాధపడుతుంటాడు. తనకు డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ ఉందని తెలుసుకుంటాడు. అంతేకాకుండా కిరాయి సైనికుడు మార్క్ స్పెక్టర్‌తో తన శరీరాన్ని పంచుకున్నట్లు గుర్తిస్తాడు. ఈజిప్ట్‌లోని శక్తివంతమైన దేవుళ్లకు సంబంధించిన రహస్యాలను అన్వేషించడానికి వెళుతున్న శత్రువులను గుర్తించినప్పుడు స్టీవెన్/మార్క్‌లకు తమ కర్తవ్యం ఏమిటో తెలుస్తుంది. ఇలా ఆద్యంతం ఆసక్తికరమైన కథతో ఈ ‘మూన్‌నైట్’ సిరీస్ నడుస్తుంది. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ సోషల్ మీడియాలో మంచి స్పందనను రాబట్టుకుంటోంది.


ఆస్కార్ ఐజాక్, ఏతాన్హాక్ మరియు మే కాలమవై నటించిన ఈ ‘మూన్ నైట్’కు మొహమ్మద్ డయాబ్, జస్టిన్ బెన్సన్ మరియు ఆరోన్మూర్‌ హెడ్ బృందం దర్శకత్వం వహించారు. జెరెమీ స్లేటర్ ప్రధాన రచయిత కాగా.. కెవిన్ ఫీగే, లూయిస్ డి ఎస్పోసిటో, విక్టోరియా అలోన్సో, బ్రాడ్ విండర్‌బామ్, మొహమ్మద్ డయాబ్, జెరెమీస్లేటర్ మరియు ఆస్కార్ ఐజాక్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరించారు.



Updated Date - 2022-01-19T23:09:01+05:30 IST