కొత్త స్క్రిఫ్ట్‌లను చదవడం మానేశాను.. డేట్స్ 2023 వరకు ఖాళీ‌గా లేవు: మనోజ్ బాజ్‌పాయ్

ABN , First Publish Date - 2022-01-19T23:02:39+05:30 IST

‘‘ఫ్యామిలీ మ్యాన్’’ వెబ్ సిరీస్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువైన నటుడు మనోజ్ బాజ్‌పాయ్. వివిధ క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు

కొత్త స్క్రిఫ్ట్‌లను చదవడం మానేశాను.. డేట్స్ 2023 వరకు ఖాళీ‌గా లేవు: మనోజ్ బాజ్‌పాయ్

‘‘ఫ్యామిలీ మ్యాన్’’ వెబ్ సిరీస్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువైన నటుడు మనోజ్ బాజ్‌పాయ్. వివిధ క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు. దీంతో తాను ప్రస్తుతం స్క్రిఫ్ట్‌లను చదవడం మానేశానని మీడియాతో చెప్పారు. తన డేట్స్ 2023 వరకు ఖాళీగా లేవని స్పష్టం చేస్తున్నారు.షెడ్యూల్ చాలా బిజీగా ఉందని అతడు పేర్కొంటున్నారు. 


తాజాగా మనోజ్ బాజ్ పాయ్ ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లో నటించారు. అభిషేక్ చౌబే దర్శకత్వంలోను మరో  సినిమాలో నటిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో షూటింగ్‌కు బ్రేక్ పడింది. కరోనా కేసులు తగ్గు ముఖం పట్టగానే షూటింగ్‌ను ప్రారంభిస్తామని దర్శకుడైన అభిషేక్ చౌబే మీడియాకు వివరించారు. ఈ మూవీలో కొంకణా సేన్ శర్మ, నాజర్, సాయాజీ షిండే తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మనోజ్ బాజ్ పాయ్ ఈ మధ్య మీడియాతో మాట్లాడారు. ‘‘ 2023 వరకు నా డేట్స్ ఖాళీగా లేవు. దీంతో కొత్త స్క్రిఫ్ట్ లను చదవడం మానేశాను. ప్రస్తుతం నేను చేస్తున్న సినిమాల షూటింగ్ ముగిసిన అనంతరమే కొత్త స్క్రిఫ్ట్‌లను వింటాను ’’ అని అతడు చెప్పారు.  

Updated Date - 2022-01-19T23:02:39+05:30 IST