సింగిలా..కమిటెడా ? అనే ప్రశ్నకు మాంజిమా ఫన్నీ ఆన్సర్

రీసెంట్‌గా సౌత్ హీరోయిన్ మంజిమ మోహన్‌కి 'మీరు సింగిలా..కమిటెడా' ? అనే ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. దానికి ఆమె ఫన్నీగా ఆన్సర్ ఇచ్చారు. మలయాళ బ్యూటీ మాంజిమా మోహన్ బాలనటిగానే మంచి పేరు తెచ్చుకుంది. ఇక హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించి మళయాల ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్‌గా మారింది. ఈ క్రమంలో తమిళంలోనూ మాంజిమాకి అవకాశాలు వచి అక్కడ కూడా క్రేజీ హీరోయిన్‌గా పాపులర్ అయింది. హీరోయిన్‌గా మొదటి సినిమా మలయాళంలో, రెండవ సినిమా తమిళంలో చేసి సౌత్‌లో తన సత్తా చాటుతోంది. నివిన్ పాలీ, శింబు, తెలుగులో 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాలో నాగ చైతన్య లాంటి క్రేజీ హీరోలతో నటించిన మాంజిమా.. భారీ హిట్స్ అందుకుది. 

కాగా ఇటీవల ఆమె రిలేషన్ షిప్ స్టేటస్‌పై సొషల్ మీడియాలో ఆసక్తికరంగా చర్చ జరిగింది. 'ఆస్క్ మీ ఎనీథింగ్' అంటూ ఇన్ స్టాగ్రామ్ లో ఫ్యాన్స్‌తో ముచ్చటించింది మాంజిమా. ఈ క్రమంలో ఒక అభిమాని మీరు 'సింగిలా? కమిటెడా?' అని ప్రశ్నించాడు. అందుకు బదులుగా మాంజిమా ఓ క్లాసిక్ మీమ్ ని షేర్ చేసింది. ఈ మీమ్ చూసిన నెటిజన్స్ నవ్వు ఆపుకోలేకపోతున్నారట. ఇదే సమయంలో 'ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్, ఫ్యామిలీ, కంపాషన్'.. ఈ మూడు తనకు ముఖ్యమని మరో ప్రశ్నకి సమాధానం ఇచ్చింది. 


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.