Ponniyin Selvan 2: విడుదలకి డేట్ ఫిక్స్.. రెండు షూటింగులు ఒకేసారి అంటూ..

ABN , First Publish Date - 2022-10-10T20:06:22+05:30 IST

మణి రత్నం (Mani Ratnam) డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్ (Ponniyin Selvan)’ ఎట్టకేలకు విడుదలై విజయవంతంగా దూసుకెళుతోంది..

Ponniyin Selvan 2: విడుదలకి డేట్ ఫిక్స్.. రెండు షూటింగులు ఒకేసారి అంటూ..

మణి రత్నం (Mani Ratnam) డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్ (Ponniyin Selvan)’ ఎట్టకేలకు విడుదలై విజయవంతంగా దూసుకెళుతోంది. సెప్టెంబర్ 30న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.300 కోట్ల వసూళ్లని సాధించింది. మొదటి పార్ట్ మంచి విజయం సాధించడంతో రెండో పార్ట్‌పై అంచనాలు భారీ పెరిగాయి. ఈ తరుణంలో ఆ సెకండ్ పార్ట్ విడుదల గురించి సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.


అందులో.. ‘ప్రత్యేకం.. పీఎస్ 1, పీఎస్ 2 (PS 2) గురించి ఇంట్రెస్టింగ్ డెవలప్‌మెంట్. మణిరత్నం సినిమా పీఎస్ 1 బాక్సాఫీస్ మీద దాడి చేస్తోంది. తమిళనాడులో అన్ని రికార్డులను తిరగరాస్తోంది (హిందీ వెర్షన్ కూడా బావుంది). ఈ రెండు సినిమాల గురించి మీ కోసం ఓ ఆసక్తికరమైన సమాచారాన్ని తీసుకొచ్చా. నిర్మాతలై లైకా ప్రొడక్షన్స్ ఆ సమాచారం తెలియజేశారు. బాహుబలి 2, కేజీఎఫ్ 2 మొదటి భాగాలు విజయవంతం అయిన తర్వాత చిత్రీకరించారు. కానీ ఈ సినిమా రెండు భాగాలను దాదాపు ఒకేసారి షూట్ చేశారు. ఇలా చేయడం వల్ల చాలా వరకూ ఖర్చులు తగ్గిపోయాయి.


పీఎస్ 1 శాటిలైట్, డిజిటల్ ప్రసారం అయితే.. పీఎస్ 2పై హైప్ పెరుగుతుంది. అది సినిమాపై అంచనాలను పెంచుతుది. నిర్మాతలు ప్రస్తుతం పీఎస్ 2 పోస్ట్-ప్రొడక్షన్ షెడ్యూల్‌ను చూసుకుంటున్నారు.  2023 పీఎస్ 2ని విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. బహుశా మరో రెండు వారాల్లో ఖచ్చితమైన తేదీని లాక్ చేసే అవకాశం ఉంది’ అని రాసుకొచ్చాడు. 


అయితే.. పాన్ ఇండియా (Pan India) స్థాయిలో తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైంది. ఈ మూవీలో ఐశ్వర్యరాయ్ బచ్చన్, చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, శోభితా ధూళిపాళ, ప్రకాశ్ రాజ్ ముఖ్యపాత్రల్లో నటించారు. కాగా.. ఈ పొన్నియిన్ సెల్వన్ విడుదలైన ప్రతి చోట విజయవంతంగా దూసుకెళుతోంది. అంతేకాకుండా.. తమిళంలో ఇప్పటి వరకూ ఉన్న పలు రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకెళుతోంది.



Updated Date - 2022-10-10T20:06:22+05:30 IST