Ponniyin Selvan 1 Twitter Review: మణిరత్నం కలల ప్రాజెక్ట్ అంచనాలను అందుకున్నట్లేనా..?

ABN , First Publish Date - 2022-09-30T15:00:37+05:30 IST

మణిరత్నం కలల ప్రాజెక్టు ‘పొన్నియిన్ సెల్వన్ (Ponniyin Selvan)’. ఎన్నో ఏళ్లుగా ఈ మూవీని తెరకెక్కించాలని ఈ డైరెక్టర్ ప్రయత్నాలు చేస్తున్నారు...

Ponniyin Selvan 1 Twitter Review: మణిరత్నం కలల ప్రాజెక్ట్ అంచనాలను అందుకున్నట్లేనా..?

మణిరత్నం కలల ప్రాజెక్టు ‘పొన్నియిన్ సెల్వన్ (Ponniyin Selvan)’. ఎన్నో ఏళ్లుగా ఈ మూవీని తెరకెక్కించాలని ఈ డైరెక్టర్ ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు 4 దశాబ్దాల తర్వాత ఎట్టకేలకు ఆ ప్రాజెక్టు పట్టాలెక్కింది. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీలో చియాన్ విక్రమ్ (Vikram), కార్తీ (Karthi), జయం రవి, ఐశ్వర్యారాయ్(Aishwarya Rai), త్రిష (Trisha), శోభిత దూళిపాళ ముఖ్యపాత్రలు పోషించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఈ రోజు (సెప్టెంబర్ 30న) ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది.


‘పొన్నియిన్ సెల్వన్ 1 (Ponniyin Selvan 1)’ని లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మించాయి. తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలో విడుదలైంది. టాప్ తెలుగు ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాని తెలుగు విడుదల చేశాడు. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత ఈ సినిమా చేయడం.. దాదాపు నాలుగు దశాబ్దాల కలల ప్రాజెక్టు కావడం.. అలాగే కల్కి కృష్ణమూర్తి రాసిన సూపర్ హిట్ నవల ఆధారంగా తెరకెక్కడం వల్ల ఈ మూవీ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే.. ఇటీవలే విడుదలైన టీజర్, పాటలు మంచి రెస్పాన్స్‌ని అందుకుని ఆ హైప్‌ని ఇంకా పెంచేశాయి. ఈ తరుణంలో విడుదలైన ఈ మూవీ ఆ అంచనాలను అందుకుందా? లేదా?. సోషల్ మీడియాలో నెటిజన్లు ఏమంటున్నారో.. ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందో చూద్దాం..



















Updated Date - 2022-09-30T15:00:37+05:30 IST