మెగాస్టార్ రిలీజ్ చేసిన 'మందులోడా' సాంగ్

'పలాస' ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో యంగ్ హీరో సుధీర్ బాబు నటిస్తోన్న మూవీ 'శ్రీదేవి సోడా సెంటర్'. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ 'మందులోడా' అనే మాస్ సాంగ్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. మణిశర్మ సంగీతం అందించగా సింగర్స్ సాహితీ చాగంటి, ధనుంజయ ఈ సాంగ్‌ను పాడారు. ఉత్తరాంధ్ర ఫోక్ సాంగ్ నుంచి ఇన్స్పిరేషన్‌గా తీసుకొని లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ దీనికి లిరిక్స్ అందించారు. తాజాగా విడుదలయిన ఈ మాస్ సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇందులో సుధీర్ బాబుకి జంటగా ఆనంది నటిస్తోంది. 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లాద్, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  సుధీర్ బాబు ఈ సినిమాతో పాటు 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే సినిమాలోనూ నటిస్తున్నారు. 'ఉప్పెన' ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీకి ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.   


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.