‘మా’: మంచి వార్త చెప్పబోతున్నానంటూ మంచు విష్ణు ట్వీట్

మంచు విష్ణు ఇటీవల ‘మా’ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తిరుపతిలో జరిగిన ప్రెస్‌మీట్లో కొన్ని అంశాలపై తమ సభ్యులతో మీడియా ముందుకొచ్చారు. ‘మా’ లో కొన్ని మార్పులు చేస్తామని, బైలాస్ మార్చుతామని చెప్పారు. ఇక రేపు (శుక్రవారం) ‘మా’కు సంబంధించి ఒక శుభవార్త చెబుతానని విష్ణు ట్వీట్ చేశారు. దాంతో ఆ శుభవార్త ఏమై ఉంటుందా అని అందరిలోనూ ఆసక్తి రేగుతోంది. శుభవార్త అంటున్నారు కాబట్టి.. వారి ప్యానల్ సభ్యులకు సంబంధించిందా లేక ‘మా’ అభివృద్ధి కార్యాచరణ గురించా అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. మరి ఆ శుభవార్త తెలియాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే.


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.