ఇక నేను చెప్పినట్టే జరుగుతుంది: మంచు విష్ణు

ABN , First Publish Date - 2021-10-10T21:49:42+05:30 IST

‘మా’ పోలింగ్ ముగిసిన అనంతరం మంచు విష్ణు సంచలన కామెంట్స్ చేశారు. అంతా నేను చెప్పినట్టే జరిగిందని, ఇక నేను చెప్పినట్టే అంతా జరుగుతుందని కౌంటింగ్ ముందు మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో

ఇక నేను చెప్పినట్టే జరుగుతుంది: మంచు విష్ణు

‘మా’ పోలింగ్ ముగిసిన అనంతరం మంచు విష్ణు సంచలన కామెంట్స్ చేశారు. అంతా నేను చెప్పినట్టే జరిగిందని, ఇక నేను చెప్పినట్టే అంతా జరుగుతుందని కౌంటింగ్ ముందు మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నాయి. మంచు విష్ణు మాట్లాడుతూ..


‘‘నేను ముందే చెప్పాను. ‘మా’ చరిత్రలో ఇదే ఫస్ట్ టైమ్. అన్ని రాష్ట్రాల నుండి మెంబర్స్ వచ్చి ఓటేస్తారని. చెప్పినట్టే జరిగింది. ఇక నేను చెప్పినట్టే జరుగుతుంది.. రిజల్ట్ కూడా. ఒకటే మాట ప్రతి ఒక్కరికీ చెబుతున్నా. ఇది తెలుగు వాళ్ల ఆత్మగౌరవానికి సంబంధించిన ఎలక్షన్. ప్రతి ఒక్కరూ రావాలని అన్నాను.. వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ.. థ్యాంక్స్ చెబుతున్నాను..’’ అని అన్నారు. 

Updated Date - 2021-10-10T21:49:42+05:30 IST