చాలా విషయాల్లో బైలాస్ మారుస్తాం : మంచు విష్ణు

‘మా’ నూతన అధ్యక్షుడిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన మంచు విష్ణు.. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం అక్కడ  విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. అందులో ప్యానల్ సభ్యులు మాదాలరవి, శివబాలాజీ, బాబూ మోహన్ పాల్గొన్నారు. తిరుమల దర్శనం బాగా జరిగిందని, తమ నియోజకవర్గం యమ్మెల్యే  బాగా హెల్ప్ చేశారని మంచు విష్ణు ఆయనకి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రకాశ్ రాజ్, తను ఇద్దరి సమక్షంలోనే ఎలెక్షన్ ఆఫీసర్ పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేయించారని ఇందులో మూడో వ్యక్తి ఎంటరవలేదని, ఆ రోజు రాత్రి టైమ్ అవడంతో ఆ మర్నాడు కౌంటింగ్ కంటిన్యూ చేశారని,  అక్కడ ఎలాంటి గొడవ జరగలేదని క్లారిటీ ఇచ్చారు విష్ణు. ఇక  సిసి టీవీ ఫుటేజ్ అడగడం అందరు ‘మా’ సభ్యుల హక్కని చెప్పారు విష్ణు.  ఇంకా బైలాస్ మారుస్తారా అనే ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. చాలా విషయాల్లో తను బైలాస్ మారుస్తానని, జనరల్ బాడీ మీటింగ్ లో ప్రపోజల్ పెడతామని, అలాగే మెంబర్ షిప్ ను స్ర్టిక్ట్ చేయాలని, ఎవరు పడితే వాళ్ళు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మెంబర్స్ కాకుండా చర్యలు తీసుకుంటామని మంచు విష్ణు చెప్పారు. ఇంకా అన్ని భాషల వారి అసోసియేషన్స్ బైలాస్ చదవుతానని, వాటిని తమకు అనుగుణంగా మార్పులు చేసి.. పెద్దల సమక్షంలో వారి అనుమతితో బైలాస్ అమలు చేస్తామని అన్నారు విష్ణు. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.