చిరంజీవిపై.. మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు

‘మా’ అధ్యక్ష పదవి పోటీలో ప్రత్యర్థి ప్రకాశ్ రాజ్ పై మంచు విష్ణు అత్యధిక మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. తుది ఫలితాల అనంతరం జూబ్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో మంచు విష్ణు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘చిరంజీవి నన్ను పోటీ నుండి విత్‌డ్రా చేసుకోమన్నారు. ఏకగ్రీవం చేసేందుకు ఆయన నన్ను పోటీ నుండి తప్పుకోమన్నారు. ఈ విషయం చెప్పకూడదునుకున్నా. కానీ ఎన్నికలు అయిపోవడం వల్ల చెబుతున్నాను. రామ్ చరణ్ నాకు మంచి మిత్రుడు.. కానీ అతను ఓటు ప్రకాష్ రాజ్ కే వేసి వుంటాడు. వాళ్ల నాన్న మాటను చరణ్ జవదాటడు. వ్యక్తిగత కారణాల వల్ల ఎన్టీఆర్ ఓటు వేయలేదు. నాకు వచ్చిన మొదటి ఫోన్ కాల్ జూనియర్ ఎన్టీఆర్ నుండే వచ్చింది. నేను నాన్ తెలుగు ఫ్యాక్టర్ ను నమ్మను. నాగబాబు తన రాజీనామాను ఉపసంహరించుకోవాలి. ఆయన రాజీనామాను ఆమోదించను. గెలుపోటములు సహజం. మా నాన్న వల్లే నేను అధ్యక్షుడిగా గెలిచా. నాన్న మీద నమ్మకంతోనే నాకు ఓటేశారు. ఓటు వేసినవారి నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తా. శివాజీ గణేషన్ కుమారుడు ప్రభు కూడా ‘మా’ సభ్యుడే.  శివాజీరాజా రాజీనామా చేస్తే ఇంటికెళ్లి కొరుకుతా. ‘మా’ సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా కృషి చేస్తాం.

మా సభ్యులు నాకు ఓటు వేసి గెలిపించినందుకు అందరికీ ధన్యవాదములు. ప్రతి ఒక్కరూ మా ప్యానెల్ వారు ఎంతో కష్టపడి పని చేశారు. అవతలి ప్యానెల్ వారు కూడా మా సభ్యులే. నాగబాబు గారు మా కుటుంబ సభ్యులే. ఆయన రాజీనామాను నేను ఆమోదించను. త్వరలోనే నాగబాబుగారిని కలుస్తాను. అలాగే ప్రకాష్ రాజ్ రాజీనామాను కూడా నేను అంగీకరించను. జరిగింది జరిగిపోయింది.. జరగాల్సింది చేయాలి. ప్రకాష్ రాజ్ సలహాలు సూచనలు కావాలి.. రెండు మూడు రోజుల్లో నేను ప్రకాష్ రాజ్ నీ కలుస్తాను. 260 మంది సభ్యులు ప్రకాష్ రాజ్ నీ కోరుకున్నారు. కాబట్టి ఆయన ‘మా’కు కావాలి. శ్రీలంక, ఆప్ఘనిస్తాన్ నుంచి కూడా నటులు తెలుగుకి రావాలి. ఇండస్ట్రీకి ఏమి కావాలో అవి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి కోరతాను. త్వరలోనే వారిని కలుస్తాను..’’ అని మంచు విష్ణు అన్నారు. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.