మా ప్యానెల్ మెంబర్స్ ను ప్రకటించిన మంచు విష్ణు

ABN , First Publish Date - 2021-09-23T17:17:13+05:30 IST

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ( మా) అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 10వ తేదీన జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో పోలింగ్ జరగనుండగా.. అదే రోజు ఫలితాలు కూడా వెల్లడించనున్నారు. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మంచు విష్ణు తన ప్యానల్ లోని సభ్యుల వివరాల్ని ఈ రోజు ప్రకటించారు.

మా ప్యానెల్ మెంబర్స్ ను ప్రకటించిన మంచు విష్ణు

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ( మా) అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.  అక్టోబర్ 10వ తేదీన జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో పోలింగ్ జరగనుండగా.. అదే రోజు ఫలితాలు కూడా వెల్లడించనున్నారు. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మంచు విష్ణు తన ప్యానల్ లోని సభ్యుల జాబితాని ఈ రోజు  అధికారికంగా ప్రకటించి.. తన గెలుపు గుర్రాల్ని రంగంలోకి దించారు. 

మంచు విష్ణు ప్యానెల్ లో జనరల్ సెక్రటరీగా రఘుబాబు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా బాబు మోహన్ ను  ఇదివరకే ప్రకటించగా..  ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్స్ గా మాదాల రవి, పృధ్విరాజ్, ట్రెజరర్ గా శివబాలాజీ, జాయింట్ సెక్రటరీస్ గా కరాటే కళ్యాణి, గౌతమ్ రాజు.. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా అర్చన, అశోక్ కుమార్, గీతాసింగ్, హరనాథ్ బాబు, జయవాణి, మలక్ పేట శైలజ, మాణిక్, పూజిత, రాజేశ్వరి రెడ్డి, రేఖ, సంపూర్ణేష్ బాబు, శశాంక్, శివన్నారాయణ, శ్రీలక్ష్మి, పి.శ్రీనివాసులు, స్వప్న మాధురి, విష్ణు బొప్పన,వడ్లపట్ల యమ్.ఆర్.సి పేర్లను ప్రకటించారు.  రేపు మంచు విష్ణు ప్యానల్ సభ్యులు మీడియా ముందుకు రానున్నారు. రేపు 2గంటలకు మంచు విష్ణు తన అజెండాను ప్రకటించనున్నారు. 

Updated Date - 2021-09-23T17:17:13+05:30 IST