Manchu Manoj: మంచు మనోజ్ భావోద్వేగ లేఖ

Twitter IconWatsapp IconFacebook Icon
Manchu Manoj: మంచు మనోజ్ భావోద్వేగ లేఖ

‘డైలాగ్ కింగ్’ మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న నటుడు మంచు మనోజ్ (Manchu Manoj). ‘బిందాస్’ (Bindaas), ‘పోటుగాడు’ (Potugadu), ‘వేదం’ (Vedam) వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. మనోజ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 18 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెబుతూ సోషల్ మీడియా వేదికగా ఓ లేఖను అభిమానులతో పంచుకున్నాడు. 


మంచు మనోజ్ ‘దొంగ దొంగది’ (Donga Dongadi) సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రానికీ సుబ్రహ్మణ్యం శివ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 2004, ఆగస్టు 6న విడుదలైంది. ‘దొంగ దొంగది’ విడుదలై 18ఏళ్లు అవుతున్న నేపథ్యంలో ట్విట్టర్‌లో బావోద్వేగ లేఖను షేర్ చేశాడు. ‘‘మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి నేను ఎంట్రీ ఇచ్చి నేటితో 18ఏళ్లు పూర్తయింది. ఈ ప్రయాణం నాకు చాలా ప్రత్యేకమైనది. ప్రేక్షకులు, నిర్మాతలు, దర్శకులు, టెక్నిషియన్స్, సహ నటులు, మీడియాకు కృతజ్ఞతలు. మీరు నా మీద చూపించిన ప్రేమ, అభిమానాలతోనే నేడు ఈ స్థాయిలో ఉన్నాను. నా మొదటి సినిమా నిర్మాతలు ఎన్‌వీ. ప్రసాద్ గారు, అశోక్ గారికి ధన్యవాదాలు. మీరు నా మీద పెట్టిన నమ్మకంతోనే ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాను. ‘దొంగ దొంగది’ నాకు ప్రత్యేకమైన చిత్రం. సుబ్రహ్మణ్యం గారు, అజయ్ విన్సెంట్ గారికి థ్యాంక్ యూ. నేను సినిమాలకు చాలా కాలంగా దూరంగా ఉన్నానని నాకు తెలుసు. కానీ, ఇది తప్పనిసరిగా తీసుకోవాల్సిన విరామం. ఏది ఏమైనప్పటికి మీ హృదయాల్లో నాకు చోటిచ్చారు. నేను సినిమాలు చేయనప్పటికీ నా అభిమానులు మంచి పనులను కొనసాగించారు. ఈ విరామ సమయంలో అమ్మనాన్నలు, సోదరుడు, సోదరి నాకు అండగా నిలిచారు. ప్రత్యేకంగా నా సోదరి గురించి చెప్పుకోవాలి. నాకు వెన్నెముకగా నిలిచింది. ఆమెకు ఎంత రుణపడి ఉన్నానో మాటల్లో చెప్పలేను. అందరు ఇచ్చిన ఆశీర్వాదాలతోనే మీ ముందుకు త్వరలోనే వస్తానని వాగ్దానం చేస్తున్నాను’’ అని మంచు మనోజ్ చెప్పాడు. ‘ఒక్కడు మిగిలాడు’ తర్వాత మంచు మనోజ్ పూర్తి స్థాయి సినిమా చేయలేదు.  హైదరాబాద్‌కు చెందిన ప్రణీత రెడ్డిని 2015లో మనోజ్ పెళ్లి చేసుకున్నాడు. వ్యక్తిగత జీవితంలో మనస్పర్థలు రావడంతో పరస్పర అంగీకారంతో వీరిద్దరూ 2019లో వైవాహిక బంధానికి స్వస్తి పలికారు. ప్రస్తుతం అతడు ‘అహం బ్రహ్మాస్మి’ చిత్రంలో నటిస్తున్నాడు. పాన్ ఇండియాగా ఈ మూవీని రూపొందిస్తామని మేకర్స్ గతంలో ప్రకటించారు.  


AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.