మీ చొరవకు కృతజ్ఞతలు: మంచు విష్ణు
ABN , First Publish Date - 2022-02-11T23:16:51+05:30 IST
సినీ నటుడు మోహన్‌బాబును ఏపీ మంత్రి పేర్ని నాని శుక్రవారం హైదరాబాద్‌లో కలిశారు. మోహన్‌బాబు ఇంటికి వెళ్లిన మంత్రి.. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. గురవారం చిరంజీవి బృందం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో జరిగిన భేటీ వివరాలు నాని తెలిపినట్లు సమాచారం.

సినీ నటుడు మోహన్‌బాబును ఏపీ మంత్రి పేర్ని నాని శుక్రవారం హైదరాబాద్‌లో కలిశారు. మోహన్‌బాబు ఇంటికి వెళ్లిన మంత్రి.. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. గురవారం చిరంజీవి బృందం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో జరిగిన భేటీ వివరాలు నాని తెలిపినట్లు సమాచారం. అయితే ఈ మేరకు మంచు విష్ణు ట్వీట్ చేశారు. ‘‘మా ఇంట్లో నానిగారిని కలవడం ఆనందంగా ఉంది. టికెట్ రేట్ల పెంపు, తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం సిద్ధం చేస్తున్న ప్రణాళికలు, అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లడానికి మీరు తీసుకున్న చొరవకు’’ కృతజ్ఞతలు నానిగారు’’ అని విష్ణు పేర్కొన్నారు.