Manasa Namaha short Film : 513 అవార్డులతో గిన్నీస్ రికార్డ్

ABN , First Publish Date - 2022-06-27T17:51:44+05:30 IST

ఒక సినిమాకి ఒక అవార్డ్ రావడమే ఎంతో గొప్పగా ఫీలవుతారు మేకర్స్. అత్యధికంగా ఒక పది అవార్డుల వరకూ ఒకే సినిమాకి రావడాన్ని ఇంకా గొప్పగా భావిస్తారు. అయితే ఒకటి కాదు రెండు ఏకంగా 513 అవార్డులు వస్తే దర్శక నిర్మాతలు ఇంకెలా ఫీలవ్వాలి? వచ్చిన అన్ని అవార్డ్స్ సినిమాకి కాదు లెండి. ఓ షార్ట్ ఫిల్మ్ కు. అందులోనూ ఒక తెలుగు షార్ట్ ఫిల్మ్ కు.

Manasa Namaha short Film : 513 అవార్డులతో గిన్నీస్ రికార్డ్

ఒక సినిమాకి ఒక అవార్డ్ రావడమే ఎంతో గొప్పగా ఫీలవుతారు మేకర్స్. అత్యధికంగా ఒక పది అవార్డుల వరకూ ఒకే సినిమాకి రావడాన్ని ఇంకా గొప్పగా భావిస్తారు. అయితే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 513 అవార్డులు వస్తే దర్శక నిర్మాతలు ఇంకెలా ఫీలవ్వాలి? వచ్చిన అన్ని అవార్డ్స్ సినిమాకి కాదు లెండి. ఓ షార్ట్ ఫిల్మ్ కు. అందులోనూ ఒక తెలుగు షార్ట్ ఫిల్మ్ కు. యువ దర్శకుడు దీపక్ రెడ్డి (Deepak Reddy) కొన్నాళ్ళ క్రితం తెరకెక్కించిన షార్ట్ ఫిల్మ్ ‘మనసానమః’ (Manasa Namaha). ప్రేమ విషయంలో అమ్మాయిల్లో ఉండే కన్ఫ్యూజన్‌ను అబ్బాయిల కోణంలో ఈ షార్ట్ ఫిల్మ్‌తో ఆవిష్కరించాడు దర్శకుడు. మంచి టెక్నికిల్ క్వాలిటీతో పాటు .. చక్కటి సందేశం ఈ షార్ట్ ఫిల్మ్ ప్రత్యేకత. ఇప్పటి వరకూ ఎన్నో దేశీయ, విదేశీయ అవార్డుల్ని కైవసం చేసుకున్న ఈ షార్ట్ ఫిల్మ్ ..513 అవార్డుల్ని సొంతం చేసుకొని ఇప్పుడు ఏకంగా..  గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకోవడం విశేషం. ఈ విషయాన్ని తాజాగా దర్శకుడు దీపక్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. 


గతేడాది ఆస్కార్ అవార్డుల నామినేషన్‌ను దక్కించుకొని అరుదైన ఘనత సాధించింది ‘మనసానమః’ షార్ట్ ఫిల్మ్. ఆస్కార్ అవార్డు రాకపోయినప్పటికీ.. నామినేషన్ దక్కించుకోవడం ఎంతో గొప్ప అచీవ్‌మెంట్ అని చెప్పాలి. అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన దీపక్ రెడ్డి.. సినిమాలపై మక్కువతో పలు షార్ట్ ఫిల్మ్స్ చేశాడు. ‘ఫిదా’ (Fida) సినిమా అమెరికా షెడ్యూల్ కు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. శేఖర్ కమ్ముల  వద్ద (Sekhar kammula) శిష్యరికం చేయడంతోనే దీపక్ కు ఫిల్మ్ మేకింగ్ పై పట్టు దొరికిందట. ఆర్జేవీ (RGV) సినిమాల్ని విపరీతంగా అభిమానించే దీపక్.. ఆయన మార్క్ ను తన సినిమాల్లో ఉండేలా ప్రయత్నం చేస్తాడట. ఎంతో మంది టాలీవుడ్ ప్రముఖులు మనసానమః షార్ట్ ఫిల్మ్ ను ప్రశంసిస్తున్నారు. దీనికి ఇన్ని రికార్డులు ఎలా వచ్చాయి? ఎందుకొచ్చాయని.. ఈ షార్ట్ ఫిల్మ్ ను పదేపదే చూస్తున్నారట. మరి దీపక్ టాలీవుడ్ లో దర్శకుడిగా ఎన్ని ఆఫర్స్ అందుకుంటాడో చూడాలి. 



Updated Date - 2022-06-27T17:51:44+05:30 IST