మేల్ యాక్టర్స్‌ షర్ట్‌లెస్‌గా కనిపిస్తే ప్రోత్సహిస్తారు..వారిని పూర్తిస్థాయిలో దుస్తులు ధరించమని ఎందుకు చెప్పరంటున్న నటి..

ABN , First Publish Date - 2021-10-22T01:37:07+05:30 IST

మేల్ యాక్టర్స్ షర్ట్‌లెస్‌గా కనిపిస్తే ప్రోత్సహిస్తారని, వారిని ఎందుకు పూర్తి స్థాయిలో దుస్తులు వేసుకోమని చెప్పారని బాలీవుడ్ హీరోయిన్ అడుగుతోంది. మన దగ్గర లింగ వివక్ష ఉందని ఆమె చెబుతోంది.

మేల్ యాక్టర్స్‌ షర్ట్‌లెస్‌గా కనిపిస్తే ప్రోత్సహిస్తారు..వారిని పూర్తిస్థాయిలో దుస్తులు ధరించమని ఎందుకు చెప్పరంటున్న నటి..

మేల్ యాక్టర్స్ షర్ట్‌లెస్‌గా కనిపిస్తే ప్రోత్సహిస్తారని, వారిని పూర్తి స్థాయిలో దుస్తులు వేసుకోమని ఎందుకు చెప్పరని బాలీవుడ్ హీరోయిన్ అడుగుతోంది. మన దగ్గర లింగ వివక్ష ఉందని ఆమె చెబుతోంది. మేకప్ వేసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే  ప్లాస్టిక్ బ్యూటీ  అంటూ ట్రోల్ చేస్తున్నారని పేర్కొంది. ఇటువంటి ట్రోల్స్‌కు తను ఎట్టి పరిస్థితుల్లో స్పందించబోనంటోంది.


రుస్తుం, కమాండో-2, రాజ్-3 వంటి సినిమాల్లో నటించి బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన నటి ఇషా గుప్తా. ఈ మధ్య బాల్కనీలో సన్ బాతింగ్ చేస్తున్న ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫొటోల్లో టాప్‌లెస్‌గా ఆమె కనిపించి కుర్రకారు మతిని పొగొట్టింది. దీంతో ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కు  వేలాదిగా అసభ్యకర కామెంట్స్ వచ్చాయి. దీంతో ఆమె స్పందిస్తూ..‘‘ నెటిజన్లు లింగ వివక్ష చూపెడుతున్నారు. చాలా మంది మేల్ యాక్టర్స్ షర్ట్‌లెస్‌గా సోషల్ మీడియాలో ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు. మీ బాడీ అద్భుతంగా ఉందంటూ వారిని ప్రోత్సహిస్తూ కామెంట్స్ చేస్తారు. వారిని ఎందుకు పూర్తిస్థాయిలో దుస్తులు ధరించమని చెప్పరు’’ అని ఆమె ప్రశ్నించింది.


‘‘ నేను నెటిజన్లు చేసే ట్రోల్స్‌కు   కొన్ని ఏళ్ల క్రితం బాధపడేదాన్ని. ప్రస్తుతం అటువంటి ట్రోల్స్ నాకు కనిపించడం లేదు. ఇటువంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లో స్పందించకూడదని నేను నిర్ణయం తీసుకున్నాను. మీరు ఏ పని చేసినా ప్రజలు వేలెత్తి చూపిస్తారని నాకు అర్థమయింది. ఒక సారి చీర ధరించి నేను ఫొటోను పోస్ట్ చేశాను. ఈ రోజు మీరు పూర్తిగా దుస్తులు ధరించారుగా అని నెటిజన్ కామెంట్ చేశారు. మేకప్ ధరించి ఫొటోలను పోస్ట్ చేస్తే ప్లాస్టిక్ బ్యూటీ అంటారు. మేకప్ ధరించకుండా ఫొటోలను పోస్ట్ చేస్తే నువ్వు బాగాలేవు. నీ ముఖానికి మేకప్ వేసుకోమని చెబుతారు.’’ అని ఆమె వివరించింది.


‘‘ నేను మానసికంగా బలవంతురాలిని. ఎవరైనా ఒక సారి నా చెంప మీద కొడితే నేను రెండు సార్లు కొడతాను. భారత్‌లోనే కాదు. ప్రపంచంలోని ప్రతి మూలాన ఈ విధంగా జరుగుతూనే ఉంది. మన ఆలోచనల్లో మార్పు వస్తుందని నేను ఆశిస్తున్నాను ’’ అని ఆమె తెలిపింది.

Updated Date - 2021-10-22T01:37:07+05:30 IST