కరోనా బారిన పడ్డ సురేశ్ గోపి

ABN , First Publish Date - 2022-01-19T20:45:32+05:30 IST

కొద్దిరోజులుగా వరుసగా సినీ సెలబ్రిటీస్ కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసిందే. వీరిలో కొందరు కోలుకోగా.. మరికొందరు ఇంకా హోమ్ ఐసోలేషన్ లోనే ఉన్నారు. ఇటీవల మలయాళ మెగాస్టార్ మమ్ముట్టికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన డాక్టర్స్ పర్యవేక్షణలో హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. అంతలోనే మరో మల్లూ స్టార్ హీరో కూడా కరోనా బారిన పడ్డారు. ఆయన మరెవరో కాదు సురేశ్ గోపి. పోలీస్ యాక్షన్ చిత్రాలతో ఆయన మంచి ఇమేజ్ తెచ్చుకున్నారు. ఆయన నటించిన పలు చిత్రాలు తెలుగులో కూడా విడుదలయ్యాయి. నేడు ( బుధవారం) ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ సురేశ్ గోపీ ట్వీట్ చేశారు.

కరోనా బారిన పడ్డ సురేశ్ గోపి

కొద్దిరోజులుగా వరుసగా సినీ సెలబ్రిటీస్ కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసిందే. వీరిలో కొందరు కోలుకోగా.. మరికొందరు ఇంకా హోమ్ ఐసోలేషన్ లోనే ఉన్నారు. ఇటీవల మలయాళ మెగాస్టార్ మమ్ముట్టికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన  డాక్టర్స్ పర్యవేక్షణలో హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. అంతలోనే మరో మల్లూ స్టార్ హీరో సురేశ్ గోపీ కూడా కరోనా బారిన పడ్డారు. పోలీస్ యాక్షన్ చిత్రాలతో ఆయన మంచి ఇమేజ్ తెచ్చుకున్నారు. ఆయన నటించిన పలు చిత్రాలు తెలుగులో కూడా విడుదలయ్యాయి. నేడు ( బుధవారం) ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ సురేశ్ గోపీ ట్వీట్ చేశారు.


‘జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ.. నాకు కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం నేను ఇంటివద్దనే స్వీయ క్వారంటైన్ లో ఉన్నాను. నేను బాగానే ఉన్నాను. ఆరోగ్యం నిలకడగా ఉంది. చిన్నపాటి జ్వరం తప్ప మరేవిధమైన సమస్యలు లేవు. మీ అందరికీ నేను చెప్పేది ఒకటే. జాగ్రత్తలు తీసుకోండి,  సామాజిక దూరం పాటించండి. జనసంచారం ఎక్కువగా ఉన్నచోటికి పోవద్దు. మీరు క్షేమంగా ఉండండి. ఎదుటివారిని క్షేమంగా ఉంచండి’.. అంటూ సురేశ్ గోపీ ట్వీట్ చేశారు.  



Updated Date - 2022-01-19T20:45:32+05:30 IST