ఆ దుండగులకు శిక్ష పడేవరకూ ఈ పోరాటం ఆగదు.. వేధింపుల కేసుపై నటి ఎమోషనల్ పోస్ట్

మలయాళీ నటి భావనా మీనన్ ఫిబ్రవరి 17, 2017న షూటింగ్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా.. కొందరు కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో ఆమెను కిడ్నాప్ చేసి వేధింపులకు గురిచేశారు. ఒక ముఠా బలవంతంగా ఆమె కారులోకి ఎక్కి రెండు గంటల పాటు వేధించింది. ఈ కేసులో నిందితుడిగా మాలీవుడ్ నటుడు దిలీప్‌ సైతం ఉన్నాడు.


తాజాగా భావనా ఇన్‌స్టాగ్రామ్‌లోకి దిలీప్‌ తనపై చేయించిన దాడి కేసు గురించి పోస్ట్ పెట్టింది. అందులో.. ‘ఇది అంత తేలికైన ప్రయాణం కాదు. బాధితుడి నుండి ప్రాణాలతో బయటపడే ప్రయాణం. ఈ దాడితో ఐదేళ్లుగా నా పేరు, గుర్తింపును కూడా ప్రభావం పడుతోంది.


నేరం చేసింది నేను కానప్పటికీ, నన్ను అవమానపరచడానికి, ఒంటరిని చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ అలాంటి సమయంలో నాకు సపోర్టుగా కొంతమంది ముందుకు వచ్చారు. నా కోసం మాట్లాడే చాలా గొంతులను వింటుంటే.. న్యాయం కోసం ఈ పోరాటంలో నేను ఒంటరిగా లేనని నాకు తెలుస్తోంద‌’ని రాసుకొచ్చింది.

అంతేకాకుండా ‘న్యాయం గెలవాలని, తప్పు చేసిన వారికి శిక్ష పడేలా చూడాలని, ఆ దుండగుల నుంచి మరెవరికీ ఇలాంటి కష్టాలు రాకుండా చూడాలని, నేను ఈ పోరాటాన్ని సాగిస్తాను. నాతో పాటు నిలబడిన వారందరికీ, మీ ప్రేమకు హృదయపూర్వక ధన్యవాదాలు’ అని భావనా తెలిపింది.


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.