‘మీ టూ’ మూవ్‌మెంట్‌‌పై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు

Twitter IconWatsapp IconFacebook Icon
మీ టూ మూవ్‌మెంట్‌‌పై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు

‘మీ టూ’ మూవ్‌మెంట్ దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. తాజాగా ‘మీ టూ’పై ఓ మలయాళ నటుడు అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో ఇరుక్కున్నాడు.  


పాపులర్ మలయాళ నటుడు వినాయకన్ విలనిజం పండించడంలో దిట్ట. ‘తిమిరు’, ‘సిరుతై’, ‘మరియన్’ వంటి సినిమాల్లో విలన్ పాత్రలు పోషించాడు. కొన్ని చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా కూడా పనిచేశాడు. తాజాగా వినాయకన్ ‘ఒరుతీ’ చిత్రంలో నటించాడు. ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా అతడు ‘మీటూ’ ఉద్యమంపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో ఇరుక్కున్నాడు. ‘‘ఓ మహిళను సెక్స్‌లో పాల్గొనమని అడగడమే ‘మీ‌టూ’ ఉద్యమం అయితే, నేను పది మంది స్త్రీలతో శారీరక సంబంధాన్ని కొనసాగించాను. మహిళల విషయంలో నా అప్రోచ్ వేరుగా ఉంటుంది. నాతో లైంగిక చర్య జరపాలనుకుంటున్నారా, లేదా అని నేరుగా అడుగుతాను. ఒక వేళ వారు అంగీకరిస్తే సెక్స్ చేస్తాను లేదా అక్కడి నుంచి వెళ్లిపోతాను. సెక్స్‌లో పాల్గొనమని స్త్రీని అడగడమే ‘మీటూ’ అయితే, నేను అలాంటి పనులను చేస్తూనే ఉంటాను’’ అని వినాయకన్ చెప్పాడు. వినయకన్ చేసిన వ్యాఖ్యలు మలయాళ సినీ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపాయి. దీంతో అవి నెట్టింట వైరల్‌గా మారాయి. అనేక మంది సెలబ్రెటీలు అతడికీ వ్యతిరేకంగా గళమెత్తడం మొదలుపెట్టారు. సోషల్ మీడియా యూజర్స్ కూడా వినాయకన్‌‌కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. ‘వినాయకన్ మతిస్థిమితం కోల్పోయాడు’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.