‘మీటూ’పై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన మలయాళ నటుడు.. క్షమాపణలు చెబుతూ ప్రకటన విడుదల..

Twitter IconWatsapp IconFacebook Icon
మీటూపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన మలయాళ నటుడు.. క్షమాపణలు చెబుతూ ప్రకటన విడుదల..

‘మీటూ’ మూవ్‌మెంట్‌పై పాపులర్ మలయాళ నటుడు వినాయకన్ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘ఒరుతీ’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ‘మీటూ’పై అభిప్రాయం అడగగా.. అనుచిత వ్యాఖ్యలు చేశాడు. తాజాగా అతడు క్షమాపణలు కోరుతూ మీడియాకు ప్రకటన విడుదల చేశాడు.  


‘‘నేను ‘ఒరుతీ’ ప్రమోష‌న్స్‌లో వాడిన భాష మహిళా జర్నలిస్టు అవమానకరంగా భావించింది. ఆమెను లక్ష్యంగా చేసుకుని నేను ఈ మాటలను అనలేదు. ఆ రోజు నేను అటువంటి భాష వాడినందుకు చింతిస్తున్నాను. నేను అన్న మాటలు ఎవరీకైనా అసౌకర్యం కలిగించినట్లైయితే క్షమాపణలు కోరుతున్నాను’’ అని వినాయకన్ ఓ ప్రకటనను విడుదల చేశాడు. తాజాగా వినాయకన్ నటించిన చిత్రం ‘ఒరుతీ’. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ‘మీటూ’పై స్పందించమని అడగగా వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఓ మహిళను సెక్స్‌లో పాల్గొనమని అడగడమే ‘మీ‌టూ’ ఉద్యమం అయితే, నేను పది మంది స్త్రీలతో పడకను పంచుకున్నాను. మహిళల విషయంలో నా అప్రోచ్ వేరుగా ఉంటుంది. నాతో లైంగిక చర్య జరపాలనుకుంటున్నారా, లేదా అని నేరుగా అడుగుతాను. ఒక వేళ వారు అంగీకరిస్తే సెక్స్ చేస్తాను లేదా అక్కడి నుంచి వెళ్లిపోతాను. సెక్స్‌లో పాల్గొనమని స్త్రీని అడగడమే ‘మీటూ’ అయితే, నేను అలాంటి పనులను చేస్తూనే ఉంటాను’’ అని వినాయకన్ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. అతడు చేసిన వ్యాఖ్యలు మలయాళ సినీ ఇండస్ట్రీలో తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. దీంతో అవి నెట్టింట వైరల్‌గా మారాయి. అనేక మంది సెలబ్రెటీలు అతడికీ వ్యతిరేకంగా గళమెత్తడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో అతడు క్షమాపణలు చెబుతూ ప్రకటన విడుదల చేశాడు.

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.