తన కండల వెనుక అసలు రహస్యం సల్మానే అంటోన్న మలయాళ యువ హీరో!

సల్మాన్ ఖాన్ అనగానే అందరికీ కండలు తిరిగిన శరీరం గుర్తుకు వస్తుంది. బోలెడు సినిమాల్లో ఆయన షర్ట్ విప్పేసి తన సిక్స్ ప్యాక్‌తో హల్‌చల్ చేస్తూనే ఉంటాడు. అయితే, మలయాళ యంగ్ హీరో టోవినో థామస్ సల్మాన్ కండల్ని కేవలం చూసి ఊరుకోలేదట! తాను కూడా బాడీ బిల్డింగ్ మొదలు పెట్టాడు. ఇప్పుడు కాదు... సినిమా రంగంలోకి రాక ముందే టోవినో జిమ్‌కి పరుగులు తీశాడు, సల్మాన్ ప్రేరణతో!


ఎప్పట్నుంచో సల్మాన్ అభిమాని అయిన టోవినో థామస్ తాజాగా తన ఫేవరెట్ హీరోని కలిశాడు. ఆ సమయంలో తీయించుకున్న ఫోటోని సొషల్ మీడియాలో షేర్ చేశాడు. భారతదేశం మొత్తంలోనే అతి పెద్ద సూపర్ స్టార్స్‌లో ఒకరైన సల్మాన్ ఖాన్ ఎంతో సాదాసీదా మనిషంటూ పొగడ్తలు కురిపించాడు. తనకు బాడీబిల్డింగ్‌లో గొప్ప ప్రేరణ అయిన సల్మాన్, నమ్రతతో మెలిగే విషయంలోనూ... ఆదర్శమంటూ టోవినో చెప్పుకొచ్చాడు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే అతికొద్ది మందిలో సల్మాన్ ఒకరంటూ తన అభిమానాన్ని చాటుకున్నాడు మలయాళ స్టార్ హీరో...  

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.