ఫొటోషూట్‌లతో మాళవిక బిజీ బిజీ

ABN , First Publish Date - 2021-10-27T03:04:39+05:30 IST

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ - దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘పేట’ చిత్రంలో చిన్న పాత్ర ద్వారా తమిళ వెండితెరకు పరిచయమైన మలయాళ బ్యూటీ మాళవికా మోహనన్‌. ఆ తర్వాత లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో

ఫొటోషూట్‌లతో మాళవిక బిజీ బిజీ

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ - దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘పేట’ చిత్రంలో చిన్న పాత్ర ద్వారా తమిళ వెండితెరకు పరిచయమైన మలయాళ బ్యూటీ మాళవికా మోహనన్‌. ఆ తర్వాత లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో విజయ్‌ నటించిన ‘మాస్టర్‌’ చిత్రంలో ప్రధాన హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం హీరో ధనుష్‌ సరసన ‘మారన్‌’ చిత్రంలో నటిస్తోంది. అలాగే ఓ బాలీవుడ్‌ చిత్రంలోనూ ఛాన్స్‌ కొట్టేసింది. అయితే, ఈ చిత్రాలు మినహా కొత్త ప్రాజెక్టులేవీ ఆమె చేతిలో లేవు. దీంతో తనకు లభించిన ఖాళీ సమయాన్ని ఆమె తన ప్రచారం, గ్లామర్‌ ఎక్స్‌పోజింగ్‌కు వినియోగించుకుంటోంది. ఇందుకోసం సోషల్‌ మీడియాను ప్రత్యేక వేదికగా చేసుకున్న మాళవిక కొత్తకొత్త ఫొటోషూట్‌ ఫొటోలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. తాజాగా ఎరుపు రంగు లంగావోణీలో ఉన్న ఆమె ఫొటోలు సోషల్‌ మీడియాలో నెటిజన్లను అలరిస్తున్నాయి.



Updated Date - 2021-10-27T03:04:39+05:30 IST