గ్లామ‌ర‌స్ లుక్‌లో మ‌లైకా టీకా .... ఫొటో షూట్ కోస‌మేనన్న అభిమానులు!

బాలీవుడ్ న‌టి మలైకా అరోరా చాలా మంది నటుల మాదిరిగానే కరోనా వ్యాక్సిన్ రెండ‌వ డోసు తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒక‌టి నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఈ వీడియోలో ఆమె  టీకా తీసుకున్న త‌రువాత వ్యాక్సినేష‌న్ సెంట‌ర్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి, త‌న కారువైపు వెళుతున్నట్లు క‌నిపిస్తోంది. ఈ స‌మ‌యంలో  మ‌లైకా బ్లాక్ జాగర్స్, జాకెట్ ధరించి కనిపిస్తోంది. 

మలైకా టీకా కేంద్రం నుంచి బయటకు రాగానే, ఆమె అభిమానులు, ఫొటోగ్రాఫ‌ర్లు ఆమెను చుట్టుముట్టారు. మలైకాకు చెందిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోను స్టార్ ఫోటోగ్రాఫర్ వైరల్ భయానీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకు 2 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఆమె అభిమానులందరూ ఆమె అందాన్ని చూసి, త‌బ్బిబ‌వుతుండ‌గా మ‌రి కొంద‌రు ఆమెను ఒక రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. మలైకా బోల్డ్ డ్రెస్ వేసుకున్నట్లు ఆ వీడియోలో క‌నిపిస్తోంది. ఒక యూజ‌ర్ టీకా వ్యాయామశాల కోసం మ‌లైకా వెళ్లార‌ని రాయ‌గా, మ‌రొక‌రు...బహుశా లోపల ఫోటోషూట్ జ‌రిగి ఉండవచ్చ‌ని రాశారు. 

Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.