ఇన్‌స్టాగ్రామ్‌లో మలైకా అరోరా, అర్జున్ కపూర్ కొత్త పోస్ట్.. విడిపోవడం లేదంటూ క్లారిటీ ఇచ్చిన రెండ్రోజులకే..

ABN , First Publish Date - 2022-01-15T02:42:10+05:30 IST

బాలీవుడ్ లవ్ బర్డ్స్ అర్జున్ కపూర్, మలైకా అరోరా గత కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ జంట విడిపోతున్నట్టు

ఇన్‌స్టాగ్రామ్‌లో మలైకా అరోరా, అర్జున్ కపూర్ కొత్త పోస్ట్.. విడిపోవడం లేదంటూ క్లారిటీ ఇచ్చిన రెండ్రోజులకే..

బాలీవుడ్ లవ్ బర్డ్స్ అర్జున్ కపూర్, మలైకా అరోరా గత కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ జంట విడిపోతున్నట్టు కొన్ని రోజులుగా బీ టౌన్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఆ పుకార్లన్నింటికి అర్జున్ కపూర్ ధీటుగా 2రోజుల క్రితం ఒక ఫొటోతో సమాధానమిచ్చారు. మలైకా అరోరాతో తీసుకున్న ఫొటోను అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫొటో కింద కామెంట్ కూడా రాశారు. ‘‘ నీచమైన  పుకార్లకు ఇక్కడ చోటు లేదు ’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో  అతడు ఒక పోస్ట్ పెట్టారు. అర్జున్ కపూర్ ఆ ఫొటోను పోస్ట్ చేసిన మరుక్షణమే మలైకా అరోరా బదులిచ్చింది. కామెంట్ బాక్స్‌లో హార్ట్ ఎమోజీతో ఆమె స్పందించింది. 


అర్జున్ కపూర్‌తో రిలేషన్ షిప్‌పై మలైకా అరోరా తన ఆలోచనలను పంచుకుంది. ఇన్‌స్టా‌స్టోరీస్‌లో ఒక మెసేజ్‌ను షేర్ చేసింది. ‘‘ 40 ఏళ్ల వయసులో కూడా ప్రేమలో పడటం సర్వసాధారణమే. 30 ఏళ్ల వయసులో కూడా కొత్త కలల వెంట పరుగులు తీయడాన్ని తప్పుగా చూడకండి. 50 ఏళ్ల వయసులో కూడా మిమ్మల్ని మీరు తెలుసుకోగలరు. 25 ఏళ్ల వయసుకే జీవితం ఆగిపోదు. అలా ఆలోచించడం మానేయండి ’’ అని ఆమె చెప్పింది. అర్జున్ కపూర్ కూడా ఇదే మెసేజ్‌ను ఇన్‌స్టా‌స్టోరీస్‌లో అభిమానులతో పంచుకున్నారు. తమ మధ్య వయో భేదం గురించి ప్రశ్నించే వారికి ఆ మెసేజ్‌తో గట్టిగా రిప్లై ఇచ్చారు. ఆ మెసేజ్‌కు అభిమానులందరు ఫిదా అయ్యారు. నెట్టింట ఆ మెసేజ్‌ను విపరీతంగా షేర్ చేస్తున్నారు.

Updated Date - 2022-01-15T02:42:10+05:30 IST