House of Dragons: హౌస్ ఆఫ్ డ్రాగన్స్ షూటింగ్ లో కష్టమయింది ఏంటో తెలిస్తే నవ్వుతారు

ABN , First Publish Date - 2022-10-01T21:25:04+05:30 IST

డిస్ని హాట్ స్టార్ లో వస్తున్న 'హౌస్ ఆఫ్ డ్రాగన్స్' (House of Dragons) వెబ్ సిరీస్ (Web Series) చూస్తున్నారు కదా. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ చేస్తున్నప్పుడు చాలా కష్టమయినది (very difficult one) ఏంటో తెలుసా?

House of Dragons: హౌస్ ఆఫ్ డ్రాగన్స్ షూటింగ్ లో కష్టమయింది ఏంటో తెలిస్తే నవ్వుతారు

డిస్ని హాట్ స్టార్ లో వస్తున్న 'హౌస్ ఆఫ్ డ్రాగన్స్' (House of Dragons) వెబ్ సిరీస్ (Web Series) చూస్తున్నారు కదా. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ చేస్తున్నప్పుడు చాలా కష్టమయినది (very difficult one) ఏంటో తెలుసా? అందులో నటిస్తున్న నటీనటులకు (Actors) తెల్ల జుట్టు (White hair) పెట్టడం. ఈ తెల్ల జుట్టు కోసమని, ఆ వెబ్ సిరీస్ నిర్వాహకులు మొత్తం యూరోప్ (Eruope) అంతా తిరిగి తెల్ల జుట్టు గుట్టలు గుట్టలు (White hair wigs) గా పట్టుకొచ్చి విగ్ లు చేశారట. ఇలా తెల్ల జుట్టు కోసం దేశ దేశాలు తిరిగి సంపాదించటమే చాలా కష్టమయిన పని అంటే మనకి నవ్వొస్తోందేమో? ఎందుకంటే జుట్టు కోసం అన్ని పాట్లు పడ్డారా అని. కానీ అది నిజం ఈ వెబ్ సిరీస్ లో చాలామంది నటీ నటులకు తెల్ల జుట్టు చూస్తున్నాం కదా మనం. నల్ల జుట్టు ఎక్కువ దొరుకుతుంది, కానీ తెల్ల జుట్టు దొరకటం కష్టం. 


ఇలా సంపాదించిన తెల్ల జుట్టుని ఒక్కొక్క నటీనటులకు అయిదు చెప్పున విగ్గులు (five wigs for each actor) తయారు చేసి పెట్టేవారట ప్రొడక్షన్ వాళ్ళు. ముందురోజు ఈ జుట్టు ని విగ్ గా తయారుచేసి, వాటిని షాంపూ (Shampoo) తో శుబ్రంగా కడిగి మర్నాడు షూటింగ్ కి రెఢీ గా పెట్టేవారట, ఇదంతా చేయటమే చాలా కష్టమయిన పని (Most difficult work) అని చెప్తున్నారు ఆ వెబ్ సిరీస్ నిర్వాహకులు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆ జుట్టుని ఒకే రకంగా విగ్ (wig) తయారు చేయడం కాదు, ఒక్కొక్కరికి ఒక్కో రకంగా, ఇంకా చూడటానికి వైవిధ్యంగా (Styling) వుండేటట్టు, అయిదు రకాల షేప్స్ (Shapes) లో తయారు చేసేవరట. 

ఇంత వరకు ఎవరూ కూడా ఇన్ని విగ్గులు (Lot of wigs) ఏ సినిమాలో కానీ, వెబ్ సిరీస్ లో కానీ వుపయోగించి వుండరేమో అని కూడా అంటున్నారు. ఏదో విగ్ పెట్టుకోవటం కాదు, అవి సహజంగా (Natural) కనిపించాలి కదా, అలాగే ఇందులో నటులకు తెల్ల జుట్టు విగ్ లతో బాగా (real) కనిపించేటట్టు తయారు చేసేవారు టీం వాళ్ళు. ఈ హౌస్ ఆఫ్ డ్రాగన్స్ (House of Dragons) ఇంతకు ముంది వచ్చిన గేమ్‌ ఆఫ్ థ్రోన్స్ (Game of Thrones)కి ప్రీక్వల్ (Prequal) గా వస్తోంది. అంటే గేమ్‌ ఆఫ్ థ్రోన్స్ కన్నా వంద సంవత్సరాల (100 years) ముందు ఏమి జరిగిందో వివరించే కథ (story) ఇది. 

Updated Date - 2022-10-01T21:25:04+05:30 IST