మోహన్‌లాల్ ‘మరక్కార్’ రికార్డు.. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే ఆ క్లబ్‌లోకి..!

ABN , First Publish Date - 2021-12-01T19:25:41+05:30 IST

మలయాళీ నటుడు, సూపర్ స్టార్ మోహన్‌లాల్ హీరోగా నటించిన చిత్రం ‘మరక్కార్: లైయన్ ఆఫ్ ది అరేబియన్ సీ’. ఈ మూవీ కోసం ఎంతో మంది సినీ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

మోహన్‌లాల్ ‘మరక్కార్’ రికార్డు.. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే ఆ క్లబ్‌లోకి..!

మలయాళీ నటుడు, సూపర్ స్టార్ మోహన్‌లాల్ హీరోగా నటించిన చిత్రం ‘మరక్కార్: లైయన్ ఆఫ్ ది అరేబియన్ సీ’. ఈ మూవీ కోసం ఎంతో మంది సినీ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఎంతో కాలంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 


అయితే ఈ మూవీ విడుదలకి ముందే ఓ రికార్డుని క్రియేట్ చేసింది. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ సినిమా 100 కోట్ల మార్కుని అందుకుందని మేకర్స్ తెలిపారు. అంతేకాకుండా మోహన్‌లాల్ సైతం 4100 స్క్రీన్స్‌లో 16000 షోస్ విడుదల కానున్నట్లు ట్వీట్‌లో చెప్పాడు. మలయాళంతో పాటు సౌతిండియా సినీ చరిత్రలోనే ఇదో మైలురాయిగా మిగిలిపోనుందని సినీ జనాలు చర్చించుకుంటున్నారు.


ఇంతకుముందు కరోనా కారణంగా పలు మార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కానున్నట్లు ప్రచారం జరిగింది. దీనిపై ఆ మూవీ డైరెక్టర్ ప్రియదర్శన్ మాట్లాడుతూ.. ‘మరక్కార్ భారీ బడ్జెట్‌తో తీసిన సినిమా.. దీన్ని ఖచ్చితంగా థియేటర్స్‌లోనే చూస్తే బావుంటుంది. అందుకే ఎంత కష్టమైన సరే బిగ్ స్క్రీన్ తర్వాతే ఓటీటీ విడుదల ఉంటుంద‌‌’ని చెప్పాడు. 


కీర్తీ సురేశ్‌, అర్జున్ సర్జా, మంజు వారియర్, సునీల్ శెట్టి ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాని ఆంటోని పెరుంబవూర్ ప్రొడ్యూస్ చేశాడు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ బాషల్లోనూ ఒకేసారి రిలీజ్ చేయనున్నారు మేకర్స్. కాగా, దాదాపు 7 సంవత్సరాల గ్యాప్ తర్వాత కీర్తీ ఈ సినిమాతో మాలీవుడ్‌కి రీ ఎంట్రీ ఇవ్వనుండడం విశేషం.



Updated Date - 2021-12-01T19:25:41+05:30 IST