హాయి హాయి హాయి ఈ మాయ ఏమిటోయి!
ABN , First Publish Date - 2022-05-19T05:30:00+05:30 IST
అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘మేజర్’. జూన్ 3న విడుదలవుతోంది.

అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘మేజర్’. జూన్ 3న విడుదలవుతోంది. ఈ చిత్రంలోని రెండో పాట ‘హాయి హాయి హాయి ఈ మాయ ఏమిటోయి’ అంటూ సాగే గీతాన్ని మేకర్స్ బుధవారం రిలీజ్ చేశారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. యువకుడిగా ఉన్నప్పుడు ఆయన తొలి ప్రేమని ఈ పాటలో ఆవిష్కరించారు. రాజీవ్ భరద్వాజ్ సాహిత్యానికి శ్రీ చరణ్ పాకాల స్వరాలు అందించారు. అర్మాన్ మాలిక్, చిన్మయి శ్రీ పాద ఆలపించారు. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో జీఎంబీ ఎంటర్టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా నిర్మించాయి. శోభితా ధూళిపాళ కథానాయిక. ప్రకాష్‌రాజ్, రేవతి, మురళీశర్మ కీలకపాత్రలు పోషించారు.