Mahesh Babu: లవ్ యూ నాన్న.. భావోద్వేగ పోస్ట్..

Twitter IconWatsapp IconFacebook Icon
Mahesh Babu: లవ్ యూ నాన్న.. భావోద్వేగ పోస్ట్..

సూపర్ స్టార్ కృష్ణ (Superstar Krishna) గుండె పోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది. పలువురు సెలబ్రిటీలు కృష్ణ మృతికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కృష్ణ మృతిపై ఆయన కుమారుడు ప్రిన్స్ మహేశ్ బాబు (Mahesh Babu) తాజాగా భావోద్వేగంగా స్పందించారు. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.


‘‘మీ జీవితం ఓ ఉత్సవం... మీ నిష్క్రమణం కూడా అంతకుమించిన వేడుకే. అదీ మీ ఔన్నత్యం. నిర్భయంగా జీవించారు మీరు, డేరింగ్ అండ్ డాషింగ్ మీ తత్వంగా బ్రతికారు. మీరు చప్పున దూరంకావడంతో - నా స్ఫూర్తి... నా ధైర్యం ఇంకా ఏ ఉన్నత విలువలు నాకు అత్యంత ముఖ్యమనుకున్నానో... అవన్నీ క్షణంలో మాయమైపోయాయి. కానీ చిత్రంగా, అంతకు ముందెన్నడూ లేని బలం ఇప్పుడు నాకు అనుభవంలోకి వచ్చింది. నేనిప్పుడు నిర్భయుడ్ని.... మీ జ్యోతి వెలిగిస్తుంది నన్ను ఎప్పటికీ. మీ వారసత్వాన్ని మున్ముందుకు  తీసికెళ్తాను. మీరు మరింత గర్వపడేలా చేస్తాను. లవ్ యూ నాన్న, మీరే నా సూపర్ స్టార్’’ అని మహేశ్ బాబు ట్విట్టర్‌లో పేర్కొంటూ.. సూపర్ స్టార్ కృష్ణ రేర్ ఫొటోని షేర్ చేశారు.


AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.