చిన్నారి హత్యాచారంపై స్పందించిన మహేశ్‌ బాబు

ఇటీవల సైదాబాద్‌లో జరిగిన చిన్నారి హత్యాచార ఘటనపై టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేశ్‌ బాబు స్పందించారు. 'ఆరేళ్ల చిన్నారిపై జరిగిన ఈ దారుణం సమాజంలో పరిస్థితులు ఎంత దిగజారిపోయాయో గుర్తు చేస్తున్నాయి. అసలు మన బిడ్డలు సురక్షితమేనా? అన్నది ఎప్పటికీ  ప్రశ్నగానే మిగిలిపోతుందా! చిన్నారి కుటుంబం ఇప్పుడు ఎంతటి దుఖంలో మునిగిపోయిందో ఊహించలేం' అంటూ మహేశ్‌ చాలా ఎమోషనల్‌ అయ్యారు. ఈ ఘటనపై త్వరగా చర్యలు తీసుకొని.. ఆ చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని మహేశ్‌ బాబు ట్విట్టర్ వేదికగా అధికారులను కోరారు.  


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.