చెలరేగారు.. ‘భీమ్లా నాయక్’పై మహేష్ బాబు పొగడ్తల వర్షం
ABN , First Publish Date - 2022-02-27T02:41:35+05:30 IST
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌తో తెరకెక్కిన ‘భీమ్లా నాయక్’ చిత్రంపై సూపర్ స్టార్ మహేష్ బాబు పొగడ్తల వర్షం కురిపించారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ తన నటనతో చెలరేగిపోయినట్లుగా..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌తో తెరకెక్కిన ‘భీమ్లా నాయక్’ చిత్రంపై సూపర్ స్టార్ మహేష్ బాబు పొగడ్తల వర్షం కురిపించారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ తన నటనతో చెలరేగిపోయినట్లుగా మహేష్ ట్వీట్ చేశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘భీమ్లా నాయక్’. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. బ్లాక్‌బస్టర్ టాక్‌తో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. సినిమాని చూసిన పలువురు సెలబ్రిటీలు ట్విట్టర్ వేదికగా తమ ఆనందాన్ని తెలియజేస్తూ.. చిత్రయూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ట్విట్టర్ వేదికగా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.
‘‘ ‘భీమ్లా నాయక్’ చిత్రం అత్యద్భుతంగా ఉంది. తెరపై పవన్ కల్యాణ్ చెలరేగిపోయాడు. రానా దగ్గుబాటి డానియల్ శేఖర్‌గా సెన్సేషన్ క్రియేట్ చేశాడు. తెరపై ఆయన కనబడిన విధానం అద్భుతం. ఎప్పటిలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన పవర్ చూపించారు. ఈ మధ్యకాలంలో ఇదే ది బెస్ట్. నాకెంతో ఇష్టమైన సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ తన విజువల్స్‌తో మాయ చేశారు. చివరగా, థియేటర్ నుండి బయటికి వచ్చినప్పటికీ థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. దర్శకుడు సాగర్ కె చంద్రకి, నిర్మాత వంశీకి, నిత్యామీనన్, సంయుక్తా మీనన్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో పాటు చిత్ర బృందం మొత్తానికి నా అభినందనలు..’’ అని మహేష్ బాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.