Mahesh babu : 42 ఏళ్ళ నట ప్రస్థానం

ABN , First Publish Date - 2021-11-29T14:15:35+05:30 IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు టాలీవుడ్ కెరీర్.. 42 ఏళ్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. 1979లో దాసరి దర్శకత్వంలో వచ్చిన ‘నీడ’ చిత్రంతో బాలనటుడిగా మహేశ్ టాలీవుడ్ లోకి ప్రవేశించారు. ఇది మహేశ్ సోదరుడు రమేశ్ బాబుకి కూడా ఎంట్రీ మూవీనే. ఆ తర్వాత దాసరి శిష్యుడు కోడి రామకృష్ణ ‘పోరాటం’ చిత్రంలో ఓ ప్రత్యేకమైన పాత్రలో మెరిసారు మహేశ్. ఇక అక్కడి నుంచి ఆయన బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించారు. తండ్రితోనూ, అన్నతోనూ, అలాగే.. ‘శంఖారావం’ చిత్రంలో చెల్లెలు ప్రియదర్శినితోనూ కలిసి నటించారు.

Mahesh babu : 42 ఏళ్ళ నట ప్రస్థానం

సూపర్ స్టార్ మహేశ్ బాబు టాలీవుడ్ కెరీర్.. 42 ఏళ్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. 1979లో దాసరి దర్శకత్వంలో వచ్చిన ‘నీడ’ చిత్రంతో బాలనటుడిగా మహేశ్ టాలీవుడ్ లోకి ప్రవేశించారు. ఇది మహేశ్ సోదరుడు రమేశ్ బాబుకి కూడా ఎంట్రీ మూవీనే. ఆ తర్వాత దాసరి శిష్యుడు కోడి రామకృష్ణ ‘పోరాటం’ చిత్రంలో ఓ ప్రత్యేకమైన పాత్రలో మెరిసారు మహేశ్. ఇక అక్కడి నుంచి ఆయన బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించారు. తండ్రితోనూ, అన్నతోనూ, అలాగే.. ‘శంఖారావం’ చిత్రంలో చెల్లెలు  ప్రియదర్శినితోనూ కలిసి నటించారు. ఇక ‘రాజకుమారుడు’ చిత్రంతో మహేశ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి.. అక్కడ నుంచి స్టారై.. సూపర్ స్టారై.. ప్రస్తుతం తన ప్రస్థానాన్ని విజయవంతంగా సాగిస్తున్నారు.


మహేశ్ బాబు టాలీవుడ్ లో 42 ఏళ్ళు సినీకెరీర్ పూర్తయిన సందర్భంగా..  సీడీపీని లాంఛ్ చేశారు. ‘42 years for ssmb reign in TFI’ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 42 ఏళ్ళ గోల్డెన్ ఎరా ఆఫ్ సూపర్ స్టార్ పేరుతో సీడీపీని అభిమానులు వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం సర్కారువారి పాట చిత్రంలో నటిస్తున్న మహేశ్ బాబు తదుపరిగా  రాజమౌళి దర్శకత్వంలో ఓ యాక్షన్ అడ్వంచరస్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాతో ఆయన పాన్ ఇండియా స్టార్ గా మారబోతున్నారు. అలాగే.. త్రివిక్రమ్ దర్శకత్వంలోనూ మహేశ్ మూడో సినిమాకి రెడీ అవుతున్నారు.  



Updated Date - 2021-11-29T14:15:35+05:30 IST