మహేశ్ తర్వాత ప్రభాస్!
ABN , First Publish Date - 2021-09-22T01:19:36+05:30 IST
ఎపిసోడ్‌కి ఓ సెలబ్రిటీతో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోను ఆద్యంతం రక్తికట్టిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. రామ్‌చరణ్‌తో మొదలైన షో వారంవారం ఆసక్తికరంగా సాగుతోంది. చరణ్, రాజమౌళి, కొరటాల శివ.. ఇలా హాట్ సీట్‌లో సెలబ్రిటీలను కూర్చోబెట్టి తనదైన శైలి ప్రశ్నాపరంపరలతో హాట్ సీట్‌లో ఉన్న అతిథిని ఆటాడిస్తున్నారు తారక్.

ఎపిసోడ్‌కి ఓ సెలబ్రిటీతో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోను ఆద్యంతం రక్తికట్టిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. రామ్‌చరణ్‌తో మొదలైన షో వారంవారం ఆసక్తికరంగా సాగుతోంది. చరణ్, రాజమౌళి, కొరటాల శివ.. ఇలా హాట్ సీట్‌లో సెలబ్రిటీలను కూర్చోబెట్టి తనదైన శైలి ప్రశ్నాపరంపరలతో హాట్ సీట్‌లో ఉన్న అతిథిని ఆటాడిస్తున్నారు తారక్. మరో ఇద్దరు స్టార్ హీరోలు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నారనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే మహేశ్ రానున్నవారం హాట్ సీట్‌లో ఉంబోతున్నారని సమాచారం. ఇప్పుడు మరో ఆసక్తికర వార్త అభిమానుల్లో ఆనందాన్ని కలిగిస్తోంది. త్వరలో రెబల్‌స్టార్ ప్రభాస్ కూడా ఈ షోలో దర్శనమివ్వబోతున్నారట. ఆ దిశగా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే హాజరైన స్టార్‌లతో షో రేంజ్ పెరిగింది. మహేశ్, ప్రభాస్ కూడా వస్తే అభిమానులకు పండగే!