ఎన్టీఆర్‌: మహేశ్‌ కృష్ణుడి పాత్రకు బావుంటారు!

జూనియర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహిస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ తొలి సీజన్‌ పూర్తయింది. చివరి ఎపిసోడ్‌కు అతిథిగా మహేశ్‌ బాబు పాల్గొని తారక్‌తో కలిసి సందడి చేశారు. ఇద్దరు స్టార్‌లు ఒకే వేదికపై తారక్‌ కనిపించడంతో అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది. తారక్‌ సంధించిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానమిచ్చి మహేశ్‌ రూ.25 లక్షలు గెలుచుకుని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘‘చిన్నప్పుడు తను వీణ బాగా వాయించేవాడినని ప్రస్తుతం బిజీ షెడ్యూల్‌ కారణంగా వీణ వాయించే సమయం దొరకట్లేదని మహేశ్‌ చెప్పారు. మహాభారతంలోని పాత్రల్లో ఏ పాత్ర అంటే ఇష్టం..? ఒకవేళ అలాంటి సినిమాలో అవకాశం వస్తే ఏ పాత్రలో నటిస్తారని తారక్‌ అడిగిన ప్రశ్నకు భారతంలో అన్ని పాత్రలు కీలకమేనని, ఎంచుకోవడం కష్టమని మహేశ్‌ చెప్పారు. మధ్యలో స్పందిన తారక్‌ శ్రీ కృష్ణుడి అవతారంలో మహేశ్‌బాబు బాగుంటారని అన్నారు. 

తనకెంతో ఇష్టమైన క్రికెట్‌ను సమయం కుదరక ఆడడం లేదని మహేశ్‌ తెలపగా.. ‘త్వరలో మీరు రాజమౌళితో సినిమా చేయబోతున్నారు కదా.. సెట్‌లో ఆయన మీతో ఆటలు ఆడిస్తారు’’ అని తారక్‌ అన్నారు. ‘‘తండ్రిగా పిల్లలతో ప్రతిక్షణాన్ని బాగా ఆస్వాదిస్తా. కుటుంబంతో కలిసి సంవత్సరంలో కనీసం మూడు విదేశీ యాత్రలకు వెళ్తుంటానుఅన్నారు. ‘సర్కార్‌వారి పాట’ గురించి చెబుతూ ఈ చిత్రం ‘పోకిరి’లా ఉంటుందని, తనది ఎనర్జిటిక్‌ పాత్ర అని తెలిపారు. 


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.