శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా రూపొందనున్న చిత్రం 'మహా సముద్రం'. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. తొలి చిత్రం 'ఆర్.ఎక్స్ 100'తో సూపర్‌హిట్ కొట్టిన దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో సిద్ధార్థ్ 8 ఏళ్ల తర్వాత తెలుగులో నటిస్తున్న చిత్రమిది. ఇన్టెన్స్ లవ్‌స్టోరిగా సినిమా రూపొందనుంది. గోవా, వైజాగ్ తదితర ప్రాంతాల్లో సినిమాను చిత్రీకరించారు.