నువ్వు పక్కనుంటే... ఆ ఉత్సాహమే వేరు... హ్యాండ్సమ్ హీరో గురించి Madhuri Dixit

ABN , First Publish Date - 2021-12-26T03:22:54+05:30 IST

‘‘నువ్వు పక్కన ఉంటే ఒక్క క్షణం కూడా నిరుత్సాహంగా గడవదు’’ అంటూ ధక్ ధక్ లేడీ తన అభిమానాన్ని చాటుకుంది. అంతే కాదు ‘‘స్టే ఫర్‌ఎవర్ యంగ్’’ అంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది...

నువ్వు పక్కనుంటే... ఆ ఉత్సాహమే వేరు... హ్యాండ్సమ్ హీరో గురించి Madhuri Dixit

డిసెంబర్ 24న, శుక్రవారం నాడు బాలీవుడ్ అందగాడు అనీల్ కపూర్ తన బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నాడు. 65వ జన్మదినం జరుపుకున్న ఆయన కుర్ర హీరోలతో ఇప్పటికీ పోటి పడుతుంటాడు లుక్స్ అండ్ ఫిట్‌నెస్ విషయంలో. అయితే, ఎవర్ హ్యాండ్సమ్ అనీల్‌తో ‘తేజాబ్, బేటా, పరిందా, రామ్ లఖన్’ లాంటి అనేక బ్లాక్ బస్టర్స్‌లో నటించిన మాధురీ దీక్షిత్ కూడా తన ఆల్ టైం ఫేవరెట్ కోస్టార్ గురించి స్పెషల్‌గా సొషల్ మీడియాలో మెసేజ్ పోస్ట్ చేసింది...


‘‘నువ్వు పక్కన ఉంటే ఒక్క క్షణం కూడా నిరుత్సాహంగా గడవదు’’ అంటూ ధక్ ధక్ లేడీ తన అభిమానాన్ని చాటుకుంది. అంతే కాదు ‘‘స్టే ఫర్‌ఎవర్ యంగ్’’ అంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. అనీల్ కపూర్ ఇంకా లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా మాధురీ పెళ్లి తరువాత సుదీర్ఘ కాలం విరామం తీసుకుని గత కొన్ని రోజులుగా సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తోంది...    

Updated Date - 2021-12-26T03:22:54+05:30 IST