‘మధురపూడి గ్రామం అనే నేను’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల

ABN , First Publish Date - 2022-01-29T22:19:49+05:30 IST

శివ కంఠమనేని హీరోగా నటిస్తున్న చిత్రం ‘మధురపూడి గ్రామం అనే నేను’. జి రాంబాబు యాదవ్ సమర్పణలో నూతన దర్శకుడు మల్లి దర్శకత్వంలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు

‘మధురపూడి గ్రామం అనే నేను’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల

శివ కంఠమనేని హీరోగా నటిస్తున్న చిత్రం ‘మధురపూడి గ్రామం అనే నేను’. జి రాంబాబు యాదవ్ సమర్పణలో నూతన దర్శకుడు మల్లి దర్శకత్వంలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు నిర్మాతలు. తాజాగా హీరో ఆకాష్ పూరీ ఈ చిత్ర ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘వెల్లే గోరింక’ను విడుదల చేశారు. అనంతరం పాట చాలా బాగుందంటూ.. హీరో శివ కంఠమనేని అలాగే చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.


‘వెల్లే గోరింక మళ్లి రావే నా వంక...

నన్నే నేను మరిసిపోయా నిన్నే చూశాక...

చాల్లే చాలింక ఈ అల్లరి ఎందాకా..

పోతా ఉంటే రారా అంటూ గోలే చేయమాక...

పట్టుకో పోనీక కట్టుకో కొంగెనక..

రైకలో దాచేయవే గుండెనే పారేయక..’ అంటూ సాగే ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ స్వరపరిచారు. ధనుంజయ్, సాహితీ ఆలపించారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



Updated Date - 2022-01-29T22:19:49+05:30 IST