Madhu shalini: తమిళ నటుడిని పెళ్లాడిన మధుశాలిని!
ABN , First Publish Date - 2022-06-18T03:19:23+05:30 IST
తెలుగు అందం మధుశాలిని గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకుని సర్‌ప్రైజ్ ఇచ్చారు. తెలుగు హీరోయిన్స్ మోస్ట్ ఎలిజిబుల్ లేడీ బ్యాచలర్‌గా ఉన్న ఆమె తమిళ నటుడు గోకుల్ ఆనంద్‌ను పెళ్లి చేసుకున్నారు. గురవారం హైదరాబాద్‌లోని తాజ్ హోటల్‌లో జరిగిన ఈ వివాహంలో ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితులు పలువురు సినీ సెలబ్రిటీలు పాల్గొన్నారు.

తెలుగు అందం మధుశాలిని (Madhushalini) గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకుని సర్‌ప్రైజ్ ఇచ్చారు. తెలుగు హీరోయిన్స్‌లో మోస్ట్ ఎలిజిబుల్ లేడీ బ్యాచలర్‌గా ఉన్న ఆమె తమిళ నటుడు గోకుల్ ఆనంద్‌ను పెళ్లి చేసుకున్నారు. గురవారం హైదరాబాద్‌లోని తాజ్ హోటల్‌లో జరిగిన ఈ వివాహంలో ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితులు పలువురు సినీ సెలబ్రిటీలు పాల్గొన్నారు. తన వివాహం గురించి ట్విట్టర్ వేదికగా తెలిపారు మధుశాలిని. గోకుల్‌తో కలిసి ‘పంచాక్షరం’ అనే తమిళ చిత్రంలో నటించారు మధు. అప్పుడు వారిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారి, పెళ్లి వరకూ వచ్చిందని సన్నిహితులు చెబుతున్నారు. కితకితలు, అందరివాడు, జగడం, కింగ్, భూత్ రిటర్స్న్, డిపార్ట్‌మెంట్ తదితర చిత్రాలతో ఆకట్టుకున్న ఆమె ఇటీవల ‘9 హవర్స్’ వెబ్ సిరీస్‌తో సందడి చేశారు. (Madhu shalini marry gokul anand)
