Katrinaతో ఆన్‌ స్క్రీన్ రొమాన్స్ చేయాలంటే... ‘ఆ బాలీవుడ్ హీరో’ అంత ఫిట్‌గా ఉండాలంటోన్న Madhavan

ABN , First Publish Date - 2022-01-16T04:09:01+05:30 IST

ప్రధానంగా తమిళంలో నటించే మాధవన్ తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితుడే. అయితే, బాలీవుడ్‌లోనూ అప్పుడప్పుడు నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో అలరిస్తూ ఉంటాడు. కాకపోతే...

Katrinaతో ఆన్‌ స్క్రీన్ రొమాన్స్ చేయాలంటే... ‘ఆ బాలీవుడ్ హీరో’ అంత ఫిట్‌గా ఉండాలంటోన్న Madhavan

కోలీవుడ్ టాలెంటెడ్ నటుడు ఆర్. మాధవన్ తనకు హృతిక్ రోషన్ సినిమాలంటే ఇష్టమని అంటున్నాడు. ఆయన చేసిన లాంటి చిత్రాలు తాను కూడా చేయాలని కోరుకుంటానన్నాడు. ‘‘అతనంటే నాకు ఎంతో అభిమానం... ఆయన ఇప్పటికి కూడా గ్రీక్ గాడ్‌లాగా కనిపిస్తాడు. అద్భుతమైన యాక్షన్ చేస్తాడు’’ అంటూ మ్యాడీ బాలీవుడ్ అందగాడ్ని ఆకాశానికి ఎత్తేశాడు. అంతే కాదు, ‘‘అతని లాగా సినిమాలు చేయాలని కోరుకుంటే సరిపోదు. ఆయనలా కత్రీనాతో కలసి నటించాలంటే అతడి లాగే నేను కూడా ఫిట్‌గా ఉండాలి’’ అన్నాడు మాధవన్.


ప్రధానంగా తమిళంలో నటించే మాధవన్ తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితుడే. అయితే, బాలీవుడ్‌లోనూ అప్పుడప్పుడు నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో అలరిస్తూ ఉంటాడు. కాకపోతే, హృతిక్ లాంటి ఫిజిక్, ఫిట్‌నెస్ మాత్రం ఈ సౌత్ స్టార్ వద్ద లేవనే చెప్పాలి. అదే విషయాన్ని ప్రస్తావించిన మ్యాడీ ‘‘మేం ఇద్దరం దాదాపూ ఒకేసారి కెరీర్ మొదలు పెట్టాం’’ అన్నాడు. కానీ, నేటికీ హృతిక్ తన ఫిట్‌నెస్‌ని అద్భుతంగా కాపాడుకుంటూ వస్తున్నాడని కోలీవుడ్ యాక్టర్ చెప్పుకొచ్చాడు. తాను అలా లేనందువల్లే కత్రీనా లాంటి బాలీవుడ్ బ్యూటీతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయటం లేదని కూడా సరదాగా వ్యాఖ్యానించాడు!


మాధవన్ ఎంతగానో అభిమానించే హృతిక్ ప్రస్తుతం ఆయన సినిమానే హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ‘విక్రమ్ వేద’ బాలీవుడ్‌ వర్షన్‌లో హృతిక్ కనిపించనున్నాడు. చూడాలి మరి, మాధవన్ స్టారర్ యాక్షన్ థ్రిల్లర్‌ని ‘గ్రీక్ గాడ్ ఆఫ్ బీ-టౌన్’ ఏ విధంగా రక్తి కట్టిస్తాడో! 

Updated Date - 2022-01-16T04:09:01+05:30 IST