Manchu Lakshmi: ఇక ఆపండి... అర్థం చేసుకోండి!

ABN , First Publish Date - 2021-10-17T23:59:09+05:30 IST

‘మా’ ఎన్నికలు పూర్తై, ఫలితాలు వెల్లడైనప్పటికీ రాద్దాంతం మాత్రం ఓ కొలిక్కి రావడం లేదు. ఏదో ఒక పక్కనుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంచు లక్ష్మీ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ఎదుటివాళ్ల మాటను అర్థం చేసుకోకుండా.. ఛాన్స్‌ దొరికితే చాలు కామెంట్‌ చేయడానికి కొంతమంది సిద్థంగా ఉంటారు’ అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

Manchu Lakshmi: ఇక ఆపండి... అర్థం చేసుకోండి!

‘మా’ ఎన్నికలు పూర్తై, ఫలితాలు వెల్లడైనప్పటికీ రాద్దాంతం మాత్రం ఓ కొలిక్కి రావడం లేదు. ఏదో ఒక పక్కనుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంచు లక్ష్మీ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ఎదుటివాళ్ల మాటను అర్థం చేసుకోకుండా.. ఛాన్స్‌ దొరికితే చాలు కామెంట్‌ చేయడానికి కొంతమంది సిద్థంగా ఉంటారు’ అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం నేపథ్యంలో మంచు లక్షీఫ్మ శుభాకాంక్షలు చెబుతూ ఓ ట్వీట్‌ చేశారు. ‘ఈరోజు మా కుటుంబానికి అత్యంత శుభదినం. నా తమ్ముడు విష్ణు.. ‘మా’ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. ప్రపంచాన్ని మార్చడానికి ఈ రోజు నుంచి నువ్వు మొదలుపెడుతున్న కొత్త ప్రయాణానికి ఆల్‌ ది బెస్ట్‌. నువ్వు ఎలాంటి మార్పులు చేయబోతున్నావో అని చూస్తున్నాను’ అని లక్ష్మీ ట్వీట్‌లో పేర్కొన్నారు.  ‘‘మా’ అధ్యక్షుడు మొత్తం ప్రపంచాన్ని ఎలా మార్చగలడు’’ అంటూ నెటిజన్లు వరుసగా పంచులు వేశారు. దీనిపై ఆమె ఫైర్‌ అయ్యారు. ‘‘ఇక ఆపండి! ఎప్పుడు ఛాన్స్‌ వస్తుందా.. ఎవర్ని కామెంట్‌ చేద్దామా.. అని చూస్తుంటారు. నటీనటులకు సినిమానే ఓ ప్రపంచం. మా అసోసియేషన్‌ ప్రపంచాన్ని మార్చడం.. అన్నది నా ఉద్దేశం. ఈ విషయాన్ని కొంచెం అర్థం చేసుకోండి’ అని చెప్పారు. 


Updated Date - 2021-10-17T23:59:09+05:30 IST