Nithin: మాచర్ల మేకింగ్‌ అదిరింది!

ABN , First Publish Date - 2022-08-09T21:16:24+05:30 IST

నితిన్‌ హీరోగా నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎమ్మెస్‌ రాజశేఖర్‌రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం పాటలు, ట్రైలర్లు ఆకట్టుకున్నాయి.

Nithin: మాచర్ల మేకింగ్‌ అదిరింది!

నితిన్‌ (Nithin)హీరోగా నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’ (Macherla Niyojakavargam) చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎమ్మెస్‌ రాజశేఖర్‌రెడ్డి (M.S. Rajasekhar reddy)దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం పాటలు, ట్రైలర్లు ఆకట్టుకున్నాయి. తాజాగా చిత్ర బృందం మేకింగ్‌ వీడియో విడుదల చేసింది. యాక్షన్‌ సన్నివేశాలు, పాటల చిత్రీకరణ ఈ వీడియోలో చూపించారు. యాక్షన్‌ పార్ట్‌ చిత్రీకరణకు టీమ్‌ ఎంతగా కష్టపడుతున్నారో చూపించారు. డాన్స్‌ విషయంలో నాయకానాయికలు ఎంతగా శ్రద్ధ వహిస్తున్నారో కనిపిస్తోంది. షూటింగ్‌ బ్రేక్‌లో హీరోహీరోయిన్లు, దర్శకుల టీమ్‌ సరదాగా కబుర్లు చెప్పకొంటూ గడిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. (Macherla Niyojakavargam on 12 august)


పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో నితిన్‌ సరసన కృతిశెట్టి(Krithi shetty), కేథరిన్‌ (Catherine)నాయికలుగా కనిపించనున్నారు. సముద్ర ఖని, శుభలేఖ సుధాకర్‌, రాజేంద్ర ప్రసాద్‌, వెన్నెల కిశోర్‌ కీలక పాత్రధారులు. మహతి స్వరసాగర్‌ సంగీతం అందించారు. 






Updated Date - 2022-08-09T21:16:24+05:30 IST