నా టీనేజ్ లైఫ్‌ని ప్రభావితం చేసిన సిరివెన్నెల వాక్యాలివి: ‘మా’ అధ్యక్షుడు విష్ణు
ABN , First Publish Date - 2021-12-01T02:41:36+05:30 IST
నా టీనేజ్ లైఫ్ మొత్తాన్ని ప్రభావితం చేసిన ఈ వాక్యాలు సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు ఒక సినిమాలో పాటగా రాశారు. నాలాంటి చాలా మందిని స్పూర్తినింపేలా ఎన్నో పాటలు రాశారు. ఈ రోజు ఆయన మరణవార్త నా మనసుని కలచివేసింది. ఆయన

‘‘చిక్కగా చీకటే కమ్మిందని..
లోకం వెళ్లి సూర్యుని రారమ్మని పిలవాలా..?
కొండలా పాపమే పెరిగిందని..
కాపాడంటూ ఈ సంఘం మన సాయం అడగాలా?’’
నా టీనేజ్ లైఫ్ మొత్తాన్ని ప్రభావితం చేసిన ఈ వాక్యాలు సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు ఒక సినిమాలో పాటగా రాశారు. నాలాంటి చాలా మందిని స్పూర్తినింపేలా ఎన్నో పాటలు రాశారు. ఈ రోజు ఆయన మరణవార్త నా మనసుని కలచివేసింది. ఆయన మరణం నాకు వ్యక్తిగతంగానే కాక తెలుగు సినీ సాహితీ లోకానికి తీరని లోటు. ఈ విషాద సమయంలో నా తరపున, మా అసోసియేషన్ తరపున.. వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను..’’ అని ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు ట్వీట్ చేశారు.