ఇవి ‘మా’ ఎన్నికలే.. యుద్ధం కాదు ప్రకాశ్‌ రాజ్‌

ABN , First Publish Date - 2021-09-28T05:18:10+05:30 IST

‘‘ఇవి ఎన్నికలు.... మా ప్యానల్‌, వాళ్ల ప్యానల్‌ మధ్య పోటీ తప్ప .. యుద్ధం కాదు. ‘మా’లో 900మంది సభ్యుల ముందు నిలబడ్డాం. ఎవరిని గెలిపించేదీ... ఓడించేదీ..... వాళ్ల హక్కు, ధర్మం, బాధ్యత!’’ అని ప్రకాశ్‌రాజ్‌ అన్నారు...

ఇవి ‘మా’ ఎన్నికలే.. యుద్ధం కాదు ప్రకాశ్‌ రాజ్‌

‘‘ఇవి ఎన్నికలు.... మా ప్యానల్‌, వాళ్ల ప్యానల్‌ మధ్య పోటీ తప్ప .. యుద్ధం కాదు. ‘మా’లో 900మంది సభ్యుల ముందు  నిలబడ్డాం. ఎవరిని గెలిపించేదీ... ఓడించేదీ..... వాళ్ల హక్కు, ధర్మం, బాధ్యత!’’ అని ప్రకాశ్‌రాజ్‌ అన్నారు. మూవీ ఆర్టిస్ట్స్‌  అసోసియేషన్‌ (మా) అధ్యక్ష పదవికి సోమవారం ఉదయం ఆయన నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన ప్యానల్‌ సభ్యులు సైతం నామినేషన్స్‌ వేశారు. అనంతరం మీడియా అడిగిన ప్రశ్నకు బదులుగా ‘‘మంచు విష్ణుగారు చెప్పినట్టు ఇవి ‘మా’ ఎన్నికలు... మా సభ్యుల మధ్య జరుగుతున్న ఎన్నికలు. రాజకీయ పార్టీల జోక్యం వద్దు’’ అని ప్రకాశ్‌రాజ్‌ సమాధానమిచ్చారు. ‘రిపబ్లిక్‌’ సినిమా వేడుకలో పవన్‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన  స్పందిస్తూ ‘‘పవన్‌కల్యాణ్‌గారు ఒక రాజకీయ నాయకుడు.


దేశం కోసం పోరాడుతున్నారు. ఆయన కూడా ‘మా’ సభ్యుడే. ఎవరేం చెప్పినా మంచి కోసమే. ఆయన మాటల్లో ఆవేశం, నిజం, మనసు ఉన్నాయి. ఎన్నికల తర్వాత పరిశ్రమ సమస్యలపై స్పందిస్తా’’ అన్నారు. ‘‘ప్రధానమంత్రి ఎన్నికల కంటే ‘మా’ ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎన్ని వివాదాలొచ్చినా మేమంతా ఒక్కటే కుటుంబం. ఎన్నికల్లో పోటీతత్వమే తప్ప శత్రుత్వం ఉండకూడదు. చిరంజీవిగారు విష్ణుకు మద్దతు ఇవ్వొచ్చు. ప్రకాశ్‌రాజ్‌కు ఆయన మద్దతు ఉందనడానికి ఆధారాలు లేవు’’ అని ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ తరపున జనరల్‌ సెక్రటరీ పదవికి నామినేషన్‌ వేసిన జీవితా రాజశేఖర్‌ అన్నారు. ‘మా’ అధ్యక్ష పదవికి నటుడు సీవీఎల్‌ నర్సింహారావు సైతం సోమవారం నామినేషన్‌ వేశారు.

Updated Date - 2021-09-28T05:18:10+05:30 IST