Maa elections: ఓట్ల లెక్కింపులో లొల్లి

ABN , First Publish Date - 2021-10-10T23:10:39+05:30 IST

రెండు నెలలుగా విమర్శలు, వివాదాలు, మాటల తూటాలు ‘మా’ ఎన్నికల వ్యవహారం మొదలైందిలా. ఎన్నికల వేళ అంటే ఆదివారం రెండు నెలలుగా విమర్శించుకున్నవారే ఒకరికొకరు నమస్కారాలు.. ఆలింగనాలు.. మధ్యలో కొట్లాటలు.. కొరుకులాటలు.. విమర్శలు, అభ్యంతరాలు.. వీటి నడుమ ఆదివారం మధ్యాహ్నం ‘మా’ ఎన్నికలు ముగిశాయి. పోస్టల్‌ బ్యాలెట్‌తో కలిపి 665 ఓట్లు పోల్‌ అయినట్లు సమాచారం.

Maa elections: ఓట్ల లెక్కింపులో లొల్లి

రెండు నెలలుగా విమర్శలు, వివాదాలు, మాటల తూటాలు ‘మా’ ఎన్నికల వ్యవహారం మొదలైందిలా. ఎన్నికల వేళ అంటే ఆదివారం రెండు నెలలుగా విమర్శించుకున్నవారే ఒకరికొకరు నమస్కారాలు.. ఆలింగనాలు.. మధ్యలో కొట్లాటలు.. కొరుకులాటలు.. విమర్శలు, అభ్యంతరాలు.. వీటి నడుమ ఆదివారం మధ్యాహ్నం ‘మా’ ఎన్నికలు ముగిశాయి. పోస్టల్‌ బ్యాలెట్‌తో కలిపి 665 ఓట్లు పోల్‌ అయినట్లు సమాచారం. అయితే కొందరు అగ్ర హీరోలు ప్రభాస్‌, తారక్‌, మహేశ్‌, అల్లు అర్జున్‌, రామ్‌, నాగచైతన్య, నితిన్‌, వరుణ్‌తేజ్‌, అల్లు శిరీష్‌, విజయ్‌ దేవరకొండ, నవదీప్‌ వంటి హీరోలు ఓటు హక్కును వినియోగించుకోలేదు. అయినప్పటికీ ‘మా’ చరిత్రలో రికార్డ్‌ స్థాయిలో ఓట్లు పోల్‌ అయ్యాయి. ఓట్ల లెక్కింపు మొదలైంది. దాంతోపాటు లెక్కింపు ప్రాంతంలో లొల్లి కూడా మొదలైంది. పోస్టల్‌ బ్యాలెట్‌ల లెక్కింపులో గొడవలు చెలరేగాయి. ప్రకాశ్‌రాజ్‌కు, ఎన్నికల అధికారికి మధ్య వాగ్వాదం జరిగింది. పెద్దలు రంగంలోకి దిగి వివాదం పెద్దది కాకుండా సర్దిచెప్పారు. 


Updated Date - 2021-10-10T23:10:39+05:30 IST