నా విజయాన్ని ఎవరూ ఆపలేరు! బండ్ల గణేశ్‌

ABN , First Publish Date - 2021-09-28T05:12:30+05:30 IST

‘‘నా గెలుపు తథ్యం. నాకు ఎంతమంది ఆశీర్వాదాలు ఉన్నాయో ఎవరికీ తెలియదు. నా విజయాన్ని ఎవరూ ఆపలేరు’’ అని బండ్ల గణేశ్‌ అన్నారు. జనరల్‌ సెక్రటరీ పోస్ట్‌కు ఆయన నామినేషన్‌ వేశారు. తొలుత ఆయన ప్రకాశ్‌రాజ్‌....

నా విజయాన్ని ఎవరూ ఆపలేరు! బండ్ల గణేశ్‌

‘‘నా గెలుపు తథ్యం. నాకు ఎంతమంది ఆశీర్వాదాలు ఉన్నాయో ఎవరికీ తెలియదు. నా విజయాన్ని ఎవరూ ఆపలేరు’’ అని బండ్ల గణేశ్‌ అన్నారు. జనరల్‌ సెక్రటరీ పోస్ట్‌కు ఆయన నామినేషన్‌ వేశారు. తొలుత ఆయన ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌లో ఉన్నారు. జీవితా రాజశేఖర్‌ వచ్చిన తర్వాత ప్యానల్‌ నుంచి బయటకొచ్చిన సంగతి తెలిసిందే. తాను విజయం సాధిస్తే... ‘మా’లో వందమంది పేద కళాకారులకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇప్పించేలా కృషి చేస్తానని బండ్ల గణేశ్‌ తెలిపారు. పవన్‌కల్యాణ్‌-ఏపీ రాజకీయాల గురించి ఇప్పుడు కాదని, ఈ నెల 11న మాట్లాడతానని ఆయన చెప్పారు.

Updated Date - 2021-09-28T05:12:30+05:30 IST