గేయ రచయిత పిరైసూడన్‌ కన్నుమూత

ABN , First Publish Date - 2021-10-09T23:47:18+05:30 IST

తమిళ చిత్రపరిశ్రమలో దాదాపు 400కు పైగా చిత్రాల్లో 1400కు పైగా పాటలు, 5 వేల భక్తి గీతాలు రాసిన ప్రముఖ గేయరచయిత పిరైసూడన్‌ (65) శుక్రవారం మృతి చెందారు. చెన్నై నగర శివారు ప్రాంతమైన నెసప్పాక్కంలో ఉన్న ఆయన నివాసంలో

గేయ రచయిత పిరైసూడన్‌ కన్నుమూత

తమిళ చిత్రపరిశ్రమలో దాదాపు 400కు పైగా చిత్రాల్లో 1400కు పైగా పాటలు, 5 వేల భక్తి గీతాలు రాసిన ప్రముఖ గేయరచయిత పిరైసూడన్‌ (65) శుక్రవారం మృతి చెందారు. చెన్నై నగర శివారు ప్రాంతమైన నెసప్పాక్కంలో ఉన్న ఆయన నివాసంలో గుండెపోటు రావడంతో శుక్రవారం సాయత్రం 4.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన తమిళ సినిమా రచయితల సంఘం కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఆయన కుమారుడు దయా పిరైసూడన్‌ సంగీత దర్శకుడుగా ఉన్నారు. ఆయన పాటలు రాసిన చిత్రాల్లో కేలడి కన్మణి, పణక్కారన్‌, కెప్టెన్‌ ప్రభాకరన్‌, అమరన్‌ తదితర హిట్‌ చిత్రాలు ఉన్నాయి. ఈయన సొంతూరు తిరువారూరు జిల్లా నన్నిలం.

Updated Date - 2021-10-09T23:47:18+05:30 IST