లగేజ్ మిస్...రానా ఫైర్
ABN , First Publish Date - 2022-12-05T04:59:54+05:30 IST
ప్రముఖ నటుడు రానాకు చేదు అనుభవం ఎదురైంది. బెంగళూరు విమానాశ్రయంలో ఆయన లగేజ్ మిస్ అయ్యింది...

ప్రముఖ నటుడు రానాకు చేదు అనుభవం ఎదురైంది. బెంగళూరు విమానాశ్రయంలో ఆయన లగేజ్ మిస్ అయ్యింది. ఈ విషయంలో ఓ ప్రైవేటు విమానయాన పనితీరుపై ఆయన ట్విట్టర్లో మండిపడ్డారు. ఆదివారం తన కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరు వెళ్లారు రానా. విమానాశ్రయంలో చెక్ ఇన్ అయ్యాక.. బెంగళూరు సర్వీసు ఆలస్యం అవుతోందని, మరో విమానంలో వెళ్లాలని, లగేజ్ కూడా షిఫ్ట్ చేస్తామని విమానయాన సిబ్బంది సూచించింది. అయితే.. బెంగళూరు వెళ్లాక అక్కడ రానా లగేజ్ కనిపించలేదు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తే వాళ్ల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దాంతో రానా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘‘మీ విమానం అనుకొన్న సమయానికి టేకాఫ్ కాకపోవొచ్చు.. ల్యాండ్ కాకపోవొచ్చు. మీ సామాను గురించి ఎలాంటి ఆధారాలూ దొరకవు’’ అంటూ విమానయాన సంస్థను ఉద్దేశించి ఓ కామెంట్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు.