Love story : అక్టోబర్ 22న ‘ఆహా’ లో స్ట్రీమింగ్

ABN , First Publish Date - 2021-10-11T19:10:31+05:30 IST

లాక్ డౌన్ అనంతరం థియేటర్స్ లో విడుదలైన సినిమాల్లో అద్భుతమైన విజయం సొంతం చేసుకున్న ప్రేమకథా చిత్రం ‘లవ్ స్టోరీ’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయిపల్లవి జంటగా నటించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ఓవర్ సీస్ లో సైతం మంచి వసూళ్ళను రాబట్టింది. ఫక్తు శేఖర్ మార్క్ మూవీగా.. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసింది.

Love story : అక్టోబర్ 22న ‘ఆహా’ లో స్ట్రీమింగ్

లాక్ డౌన్ అనంతరం థియేటర్స్ లో విడుదలైన సినిమాల్లో అద్భుతమైన విజయం సొంతం చేసుకున్న ప్రేమకథా చిత్రం ‘లవ్ స్టోరీ’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయిపల్లవి జంటగా నటించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ఓవర్ సీస్ లో సైతం మంచి వసూళ్ళను రాబట్టింది. ఫక్తు శేఖర్ మార్క్ మూవీగా..  టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసింది. ఇక ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు విడుదలవుతుందా అనే ఆత్రుతతో ఉన్నారు ప్రేక్షకులు. 



అయితే తాజాగా ఈ సినిమాను ఆహాలో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించి స్ట్రీమింగ్ డేట్ ను వదిలారు. అక్టోబర్ 22న ఆహాలో ‘లవ్ స్టోరీ’ సినిమా స్ట్రీమింగ్ కానుంది.  సరిగ్గా సెప్టెంబర్ 4న థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా నాలుగు వారాల గ్యాప్ తర్వాత ఓటీటీలోకి రానుండడం విశేషం. థియేటర్స్ లోనే అఖండ విజయం సాధించిన ‘లవ్ స్టోరీ’ మూవీ ఆహాలో ఇంకే రేంజ్ లో అదరగొట్టబోతుందో చూడాలి. 

Updated Date - 2021-10-11T19:10:31+05:30 IST