సెట్లో దర్శకులకు కోపం రావడం సహజం అని వింటుంటాం. పాత రోజుల్లో అయితే సీన్ సరిగా రాకపోయినా, టేక్‌లు ఎక్కువ తీసుకున్నా.. అది ఇంకాస్త ఎక్కువగా ఉండేది. ఇప్పటి రోజులకు తగ్గట్టే మనుషుల ప్రవర్తన కూడా ఉంటుంది. అయితే ఎంతో కామ్‌గా, సిగ్గుగా ఉండే దర్శకుడు శేఖర్ కమ్ములకు కోపం వస్తే ఏం చేస్తారు? ఎలా స్పందించారు. ‘లవ్‌స్టోరీ’ సినిమా బృందం బయటపెట్టింది. రానా హోస్ట్‌గా ‘ఆహా’లో ప్రసారమయ్యే ‘నం.1 యారి’ షోలో ‘లవ్‌స్టోరీ’ టీమ్ సందడి చేసింది. ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల గురించి నాగచైతన్య, సాయు పల్లవి ఆసక్తికరమైన విషయాలు షేర్ చేశారు. శేఖర్ కమ్ములలో స్పెషల్ ఏంటి అని సాయి పల్లవిని రానా అడగగా ‘‘ఆయన విషయంలో నేను పొసెసీవ్. చైతూను మెచ్చుకుంటే ఆయన వైపు కోపంగా చూస్తా. అసలు నాకు సంబంధం లేని విషయాల్లో కూడా ఆయనకు సజెషన్స్ ఇస్తా. దానికి ఆయనెలా రెస్పాండ్ అవుతారా అని ఎదురుచూస్తుంటా’’ అని సాయి పల్లవి తెలిపారు.
‘‘నేను ఎవర్నీ పెద్దగా పొగడను. గుడ్ అని చెప్తానంతే! సీన్ నచ్చకపోతే మానిటర్ దగ్గర్నుంచి వెళ్లిపోతా’ అని శేఖర్ చెబుతుండగా నాగచైతన్య మధ్యలో అందుకుని ‘‘దాదాపు ‘గుడ్’ అంటారు. ఈ మధ్యనే ‘యాక్’ అనే పదం నేర్చుకున్నారు’’ అని నవ్వుతూ చెప్పారు. ‘‘హమ్మయ్య నేను మాత్రం ‘యాక్’ అనిపించుకునేంత దారుణంగా ఎప్పుడూ చేయలేదు’’ అని రానా అనడంతో షోలో నవ్వులు పూశాయి. దీనికి సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో వైరల్ అయింది. ‘లవ్‌స్టోరీ’ చిత్రం ఏప్రిల్ 16న విడుదల కావల్సి ఉండగా కరోనా కారణంగా వాయుదా పడింది.