‘లవ్‌ స్టోరి’ సెన్సార్ పూర్తి.. రిలీజ్‌కి రెడీ

శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘లవ్‌ స్టోరి’. తాజాగా ఈ చిత్రానికి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించారు. రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చినవన్నీ మంచి అంచనాలు పెంచాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలు మరింతగా పెంచింది. అందరూ ‘లవ్‌ స్టోరి’ సూపర్ హిట్ అవుతుందని చాలా నమ్మకంగా ఉన్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికెట్ పొందింది. ఈనెల 24న భారీ స్థాయిలో థియేటర్స్‌లో విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని నారాయణ్‌ దాస్‌ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు నిర్మించారు. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.