థియేటర్లలోనే చూడాల్సిన సినిమా

ABN , First Publish Date - 2021-09-18T05:00:06+05:30 IST

‘‘అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘ప్రేమనగర్‌’ 50 ఏళ్ల క్రితం సెప్టెంబర్‌ 24న విడుదలై చరిత్ర సృష్టించింది. ఇప్పుడు అదే తేదీన నాగచైతన్య నటించిన ‘లవ్‌స్టోరీ’ విడుదలవుతోంది. ఈ సినిమా కూడా ఆ స్థాయి విజయాన్ని అందుకుంటుందనే నమ్మకం ఉంది....

థియేటర్లలోనే చూడాల్సిన సినిమా

నారాయణదాస్‌  కె. నారంగ్‌, పి. రామ్‌ మోహన్‌ రావు


‘‘అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘ప్రేమనగర్‌’ 50 ఏళ్ల క్రితం సెప్టెంబర్‌ 24న విడుదలై చరిత్ర సృష్టించింది. ఇప్పుడు అదే తేదీన నాగచైతన్య నటించిన ‘లవ్‌స్టోరీ’ విడుదలవుతోంది. ఈ సినిమా కూడా ఆ స్థాయి విజయాన్ని అందుకుంటుందనే నమ్మకం ఉంది. సినిమాను తెలుగు రాష్ట్రాల్లో 600 స్ర్కీన్లలో విడుదల చేస్తున్నాం. తమిళ, కన్నడ భాషల్లో డబ్‌ చేసి విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాతలు నారాయణదాస్‌ కె. నారంగ్‌, పి. రామ్‌ మోహన్‌ రావు చెప్పారు. వారిద్దరూ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘లవ్‌స్టోరీ’. 


నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించారు. శేఖర్‌ కమ్ముల దర్శకుడు. ఈ నెల 24న సినిమా థియేటర్లలో విడుదలవుతున్న సందర్భంగా నారాయణదాస్‌ కె. నారంగ్‌, పి. రామ్‌ మోహన్‌ రావు చిత్ర విశేషాలను పంచుకున్నారు. 


‘ఫిదా’ సినిమా సెట్స్‌లో శేఖర్‌ కమ్ముల గారిని కలసి ఒక సినిమా చేయమని అడిగాం. అలా ‘లవ్‌స్టోరీ’ చిత్రం ప్రారంభమైంది. ఆయనే సాయిపల్లవిని ఈ సినిమాలో నటించేందుకు ఒప్పించారు. ప్రేమకథలను హృద్యంగా మనసును తాకేలా చెప్పగలగడం శేఖర్‌ కమ్ముల బలం. ఆయన గత చిత్రాల శైలిలోనే ‘లవ్‌స్టోరీ’ కూడా యువత, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇలాంటి చిత్రాన్ని థియేటర్లలో చూస్తేనే పాత్రల తాలూకు భావోద్వేగాలకు ప్రేక్షకులు అనుభూతి చెందుతారు. అందుకే మాకు ఓటీటీ రిలీజ్‌ ఆలోచనే రాలేదు. 


వెంకటేశ్వర ఎల్‌ఎల్‌పీ పేరుతో సొంత ప్రొడక ్షన్‌ హౌస్‌ను స్థాపించి ఈ సినిమాతో తొలిసారి ప్రొడక్షన్‌ రంగంలోకి అడుగుపెట్టాం. ప్రస్తుతం పది చిత్రాలు చేస్తున్నాం. అవన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. శేఖర్‌ గారు తదుపరి చిత్రం కూడా మా బేనర్‌లో ధను్‌షతో చేస్తున్నాం. జనవరిలో ప్రారంభమవుతుంది. నాగశౌర్యతో చేస్తున్న సినిమా నవంబర్‌లో విడుదల చేస్తాం. నాగార్జునతో చేసే సినిమాను ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. ఇవి కాకుండా ధనుష్‌, శివకార్తికేయన్‌, సుధీర్‌బాబు, నాగచైతన్యతో చేస్తున్నాం.

Updated Date - 2021-09-18T05:00:06+05:30 IST